రాహుల్ కూడా అదే సమస్యలను ఎదుర్కొంటున్నారు: మాజీ రాష్ట్రపతి

Tuesday, October 17th, 2017, 10:53:09 AM IST

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సారి వచ్చే ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలని పార్టీ కమిటి చాలా కష్టపడుతోంది. రాహుల్ గాంధీ చాలా వరకు పోరాడుతున్న పార్టీకి ఏ మాత్రం లాభం లేకపోతోంది. అయితే పార్టీలో పలువురు సీనియర్ నాయకులు అలాగే ప్రతి పక్ష నాయకులు రాహుల్ కి పార్టీ ఉపాధ్యక్షుడిని చేయడంపై చాలా సార్లు పలువురు విమర్శలు చేశారు. అయితే ఆ తరహా వ్యాఖ్యలను మాజీ రాష్ట్రపతి – సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రణబ్ ముఖర్జీ కొట్టి పారేశారు.

రీసెంట్ గా యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాహుల్ గురించి మాట్లాడారు. రాహుల్ చాలా తెలివిగలవాడని ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగల సమర్థుడు. సమయం వచ్చినప్పుడు అందరికి తెలుస్తుందని చెప్పారు. అంతే కాకుండా రాజీవ్ గాంధీ – ఇందిరా గాంధీ కూడా రాజకీయాల్లోకి వచ్చే ముందు చాలా సమస్యలను ఎదుర్కొన్నారని చెబుతూ.. రాహుల్ కూడా ముందు వారిలనే కొన్ని పరీక్షలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇక రాహుల్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది రాజ్యాంగ నియమం ప్రకారం పార్టీనేతలందరు కలిసి తీసుకోవాలని ఆయన వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments