మూడో కూటమి పై ప్రణబ్ ప్లాన్?

Wednesday, May 30th, 2018, 03:31:15 PM IST

దేశంలో కూటముల మధ్య ప్రస్తుతం రాజకీయాలు చాలానే జరుగుతున్నాయి. కాంగ్రెస్ కూటమి ఏర్పరుచుకున్న విధానానికి భారత జనతా పార్టీ ఎప్పుడో కౌంటర్ ఇచ్చింది. ఎన్డీయే కూటమిని బలంగా చేసుకొని రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకులను కలుపుకుంటూ పోతే ఎదో విధంగా బలం చేకూరుతుంది. అదే తరహాలో కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే కేసీఆర్ కంటే ముందే ఈ ఆపరేషన్ ను సొంతంగా ప్రణబ్ ముఖర్జీ మొదలు పెట్టారన్న వార్తలు గట్టిగానే వస్తున్నాయి. ఇటీవల ఎన్డీటీవీ ఈ విషయంపై వివరణ ఇచ్చింది. ప్రణబ్ ప్రధాని అవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయనకు కొన్ని సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ఆ అదృష్టం మన్మోహన్ సింగ్ ను వరించింది. 2004లో ప్రణబ్ ముఖర్జీ కి దాదాపు పీఎం సీటు ఫిక్స్ అని అంతా అనుకున్నా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. రాష్ట్రపతి అయ్యే ఇష్టం ఆయనకు లేదు.

82 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ తన 50 ఏళ్ల రాజకీయ అనుభవంతో 2019కి ప్రత్యేక కూటమిని ఏర్పాటు సుసాధ్యమే అవుతుందని నార్త్ లో టాక్ గట్టిగా వస్తోంది. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నవారితో ఇప్పటికే ప్రణబ్ చర్చలు జరిపారు. దేశంలో ప్రముఖ అర్ఎస్ఎస్ నిర్వహించే సభకు ప్రణబ్ ముఖ్య అతిధిగా వెళ్లడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. జేడీఎస్ దేవెగౌడ – సీపీఎం నేత సీతారాం ఏచూరి – భాజపా సీనియర్ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ తో కూడా మంతనాలు జరిగాయి.

థర్డ్ ఫ్రంట్ సక్సెస్ చేసేందుకు గత ఏడాది నుంచే ఆయన కార్యాచరణ మొదలు పెట్టినట్లు సమాచారం. మమతా బెనర్జీ ముందు నుంచి ప్రణబ్ కు మద్దతుగా ఉన్నారు. ఇక నరేంద్ర మోడీ తరువాత ప్రధాని అయ్యే అర్హత ప్రణబ్ ముఖర్జీకి మాత్రమే ఉందని చెప్పిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ థర్డ్ ఫ్రంట్ పజిల్ పై అసలైన క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments