ప్రణయ్ ప్రాణం ఖరీదుకి కోటి రూపాయలు వెల కట్టిన టీడీపీ..!

Thursday, September 20th, 2018, 12:52:00 PM IST

కులం అనే మహమ్మారి పేరిట ఒక నిండు ప్రాణాన్ని మిర్యాలగూడలో బలికొన్న ఉదంతం ఎంత కలకలం రేపిందో అందరికి తెలిసిందే. ఐతే ఈ సమస్యనే ప్రధాన అంశంగా మలచి ఇతర పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకి ఉపయోగించుకుంటున్నారా?అన్న సందేహం కూడా లేకపోలేదు.ఈ విషయం మీద కూడా ప్రతిపక్షాలు అధికార పక్షం పనితీరుని ఎండగడుతున్నాయి.ఈ విషయానికి సంబంధించి తెలంగాణా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తెరాస ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ప్రణయ్ అమృతల జీవితంలో ఒక్కసారిగా ఇంత విషాదం చోటు చేసుకునే సరికి ప్రతి ఒక్కరు ఎంతగానో చలించిపోయారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణా టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మరియు సహచరులు అమృత మరియు ప్రణయ్ ల కుటుంబాన్ని పరామర్శించడానికి వారి వద్దకు వెళ్లారు.ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణయ్ కుటుంబాన్ని పరామార్శించకపోవడం చాలా బాధాకరం అని,వారి యొక్క మహాకూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ప్రణయ్ తల్లికి ఒక ప్రభుత్వ ఉంద్యోగం కల్పిస్తాం అని,అమృత తండ్రి మారుతీరావు ఆస్తిలోని సగం వాటా అమృతకు చెందేలా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.తన భర్త ప్రాణాలను పోగొట్టుకున్న అమృతకు తెలంగాణా ప్రభుత్వం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని నిగ్గదీసి అడిగారు.