చంపేసే వ‌ర‌కూ అయినా నీతో క‌లిసి ఉంటాను!

Sunday, September 16th, 2018, 09:03:40 PM IST


ప్రేమికుడు ప్ర‌ణయ్ హ‌త్య దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ప‌రువు హ‌త్య‌గా.. కుల పిచ్చితో చేయించిన హ‌త్య‌గా మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కులం ఇంత దారుణంగా హ‌త్య చేయిస్తుందా? అని జ‌నం నోరెళ్ల బెట్టారు. ఈ హ‌త్య వెన‌క కోటి రూపాయల సుఫారీ ఉంద‌న్న మాట‌తో అమృత తండ్రి ప్ర‌ణ‌య్‌పై ఎంత ప‌గ‌బ‌ట్టాడో అర్థ‌మైంది. ఏదో ఒక‌రోజు చంపేస్తార‌ని ఈ ప్రేమికుల జంట‌కు తెలుసు. నాన్న‌ కులం కోసం ఎంత‌టి అఘాయిత్యానికి అయినా పాల్ప‌డ‌తాడ‌ని అమృత‌కు తెలుసు. ఇదే విష‌యంపై ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బోలెడంత డిస్క‌ష‌న్ సాగింది.

ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కాపురం ఉంటున్నారు. విడ‌దీసేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు సాగాయి. చంపేస్తాన‌ని ప్ర‌ణ‌య్‌ని మామ బెదిరించాడు. బిహార్ గ్యాంగ్‌ల‌ను హైద‌రాబాద్‌లో దించాడు. న‌యీం అనుచ‌రుల‌తోనూ నెట్ వ‌ర్క్ ఉన్న బ‌డా బిజినెస్‌మేన్ అత‌డు. అందుకే ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని ముందే తెలిసిన ఆ ఇద్ద‌రు ప్రేమికులు వాళ్ల‌లో వాళ్లు మాట్లాడుకున్న మాట‌లు ఎంతో ఎమోష‌న్‌ని ర‌గిలిస్తున్నాయి. “చంపేసే వ‌ర‌కూ అయినా నీతో క‌లిసి ఉంటాను!“ అని ప్ర‌ణ‌య్ అన్నాడ‌ని అమృత టీవీ చానెల్‌ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం .. ఇదంతా ఓ సినిమానే త‌ల‌పిస్తోంది. ప్ర‌ణ‌య్‌ మిరియాలగూడ వాసి. అత‌డు లేక‌పోయినా త‌న జ్ఞాప‌కంగా మిర్యాల‌గూడ‌లో త‌న విగ్ర‌హం ఉండాల‌ని భార్య అమృత మీడియా ముఖంగా ప్ర‌భుత్వాన్ని కోరింది. త‌న జ్ఞాప‌కాలు త‌న‌కు కావాల‌ని అంది. మ‌రి ఈ ప్రేమికురాలి కోరిక‌ను మ‌న్నించి, విగ్ర‌హం ఏర్పాటు చేస్తారా? అన్న‌ది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments