వైఎస్ జ‌గ‌న్ చేతికి.. పీకే స‌ర్వే ఫైన‌ల్ రిపోర్ట్స్..?

Friday, February 1st, 2019, 09:55:23 AM IST

ఏపీలో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌షాంత్ కిషోర్ టీమ్‌తో స‌ర్వే చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి అన్ని జిల్లాల్లోని సెగ్మెంట్ వారిగా జ‌నంప‌ల్స్ శ్యాంపిల్స్ తీసుకున్న పీకే టీమ్, వాటికి స‌బంధించిన నివేధిక‌ల‌ను జ‌గ‌న్‌కు స‌మ‌ర్పించార‌ని తెలుస్తోంది. ఇక అభ్యర్ధుల విష‌యం చేయించిన స‌ర్వే మాత్రం ఇంకా పూర్తి కాలేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 85 అసెంబ్లీ స్థానాల్లోనే అభ్య‌ర్ధుల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని స‌మాచారం.

రాష్ట్రంలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న నేప‌ధ్యంలో మిత‌గా 90 స్థానాల్లో అభ్య‌ర్ధుల విష‌యంలో వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతుంద‌ని తెలుస్తోంది. దీంతో అభ్య‌ర్ధుల‌కు సంబంధించిన పీకే స‌ర్వే రిపోర్ట్స్ ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలోపు అంద‌జేయాల‌ని వైసీపీ అధిష్టానం ఆదేశించిద‌ని తెలుస్తోంది. ఎందుకంటే జ‌గ‌న్ బ‌స్సుయాత్ర‌కు ముందే ఎక్కువ మంది అభ్య‌ర్ధ‌ల‌ను ప్ర‌క‌టించాని భావిస్తున్నారు. దీంతో ప‌లు పీకే టీమ్‌కు సంబంధించి ప‌లు బృంధాలు రంగంలోకి దిగాయ‌ని స‌మాచారం.

ఇక ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రు ఇంచార్జ్‌లు ఉండ‌డంతో, వారి మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌క‌పోవ‌డంతో, జ‌గ‌న్ వారిని పిలిపించుకొని మ‌రీ బుజ్జ‌గిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఒక‌రికే అసెంబ్లీ టిక్కెట్ ల‌భిస్తోంద‌ని, మ‌రొక‌రి త‌మ పార్టీ అధికారంలోకి రాగానే ప‌ద‌వి ఇస్తామ‌ని జ‌గ‌న్ న‌చ్చ‌జెప్పుతున్నారు. అయితే వారు మాత్రం తాము ప్రజల్లో బలంగా వెళ్లామని, ఇప్పడు టిక్కెట్ నిరాకరిస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు జగన్ ఎదుటే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రుక‌ల్లా పీకే స‌ర్వే రిపోర్ట్స్ వ‌స్తాయ‌ని, దాని ప్ర‌కారమే టిక్కెట్ ఇస్తాన‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి పీకే స‌ర్వే ఫైన‌ల్ రిపోర్ట్స్ వ‌చ్చాక వైసీపీలో ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు అవుతాయో చూడాలి.