బుద్దా వెంక‌న్న‌ : వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో ప్రశాంత్ కిశోర్ హ‌స్తం..?

Friday, March 15th, 2019, 10:30:33 PM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి మృతితో మ‌ళ్లీ శ‌వ‌రాజ‌కీయాల‌కు తెరలేపార‌ని ఏపీ ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న విమ‌ర్శించారు. బుద్దా వెంక‌న్న ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద‌రెడ్డి మృతిపై త‌మ‌కు ఎన్నో అనుమానాలు ఉన్నాయ‌న్నారు.

వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగిన త‌రువాత పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండానే వైఎస్ ఫ్యామిలీ స‌భ్యులు ర‌క్త‌పు మ‌డుగుల‌ను తుడిచేశార‌న్నారు. ఆ వెను వెంట‌నే వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడ‌ని క‌ట్టు క‌థ‌లు ఎందుకు అల్లార‌ని ప్ర‌శ్నించారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో వైఎస్ కుటుంబ స‌భ్యులపైనే ప్ర‌జ‌ల‌కు అనుమానాలు ఉన్నాయ‌ని, ఆయ‌న హ‌త్య వెనుక పెద్ద కుట్రే దాగి ఉంద‌ని, ఈ హ‌త్య‌లో వైసీపీ వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌శాంత్ కిశోర్ హ‌స్తం ఉండొచ్చ‌ని, ఆ విష‌యం పోలీసుల విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డుతుంద‌ని బుద్దా వెంక‌న్న ఆరోపించారు.
Attachments area