ప్రశాంత్ కిషోర్ వేసిన ఆ ప్లాన్ కూడా జగన్ గెలుపులో కీలకమయ్యింది..!

Sunday, May 26th, 2019, 02:40:32 AM IST

ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొన్న ఫలితాలు వెలువడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ఫలితాలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత ఎన్నికలలో ఓటమిపాలైన జగన్‌కు ప్రశాంత్ కిషోర్ వంటి ఆయుధం దొరికింది. గత మూడేళ్ళ నుంచి జగన్ కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ టీం పార్టీ గెలుపు కోసం బాగానే కష్టపడింది. అయితే ఈ ఐదేళ్ళలో ప్రజలలో జగన్‌కి ఇంత క్రేజ్ రావడానికి ఒక విధంగా ప్రశాంత్ కిషోర్ అనే చెప్పాలి.

అంతేకాదు జగన్ మాట్లడబోయే స్పీచ్ దగ్గర నుంచి కార్యకర్తలను ఎలా ముందుకు నడిపించాలి అనే అంశాల వరకు అన్నీ తామై చూసుకున్నారు. జగన్ కోసం సర్వేలు, సోషల్ మీడియా వంటి టెక్నాలజీ వంటివి బాగా వాడుకుని వైసీపీ పేరు గట్టిగా వినపడేలా చూసుకున్నాడు. అంతేకాదు రావాలి జగన్.. కావాలి జగన్.. అనే స్లోగన్లతో ప్రజల్లో మరింత ఊపును తీసుకువచ్చాడు ఎంతలా అంటే ఈ పదాన్ని వారి నోట్లో నిలిచిపోయేంతలా. అయితే జగన్ పాదయాత్రను కూడా ప్రశాంత్ కిషోర్ ముందుండి నడిపించాడు. ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో వెంట వెంటనే జగన్‌కు సలహాలందిస్తూ ఉండేవాడు. అయితే పాదయాత్రలో మరో సరికొత్త ఫార్ములాను వాడాడు ప్రశాంత్ కిషోర్. సెల్ఫీ విత్ జగన్ అంటూ అడిగిన ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇచ్చేలా చూసుకున్నాడు. అంతేకాదు వరిని నవ్వుతూ పలకరించడం చిన్నపిల్లల్లను, ముసలవ్వలను సరదాగా అక్కున చేర్చుకోవడం ఇవన్నీ ప్రజలు తమ సెల్ ఫోన్‌లలో బందించుకున్నారు. వెంటనే ఆ ఫోటోలను వారు తమ బంధువులకు, స్నేహితులకు పంపించి జగన్ మాతో మాట్లాడడని, ఫోటో కూడా దిగాడని చెప్పుకోవడం స్టాట్ చేశారు. ఈ ఫోటోలు ఎంతలా అంటే రోజుకు వెయ్యికి పైగానే ఓపికగా సెల్ఫీలు ఇచ్చేవాడట జగన్. ఇలా చేసినందుకే అనతి కాలంలోనే జగన్‌పై ప్రజలలో మంచి నాయకుడు అని పేరు వచ్చేసింది. దానికి ప్రతిఫలమే ఈ రోజు సీఎంను చేసింది. ఏది ఏమైనా జగన్‌కి మంచి క్రేజ్‌ను తీసుకువచ్చిన ఈ ఫార్ములా కూడా ప్రశాంత్ కిషోర్ ఆలోచనలో భాగమేనట. ఇది కూడా జగన్ గెలుపుకు ఒక కారణమేనట.