నేటి స్వీటు – రేపటి “మీటూ” – స్టార్ హీరోయిన్ షాకింగ్..!

Monday, November 19th, 2018, 01:04:45 PM IST

గత కొద్దీ కాలంగా భారత సినీ పరిశ్రమను కుదిపేస్తున్న అంశం మీటూ ఉద్యమం. నటీనటుల్లో ఎవరిని కదిలించినా ఇదే చర్చ జరుగుతుంది. తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ప్రముఖ హీరోలు, దర్శకులపై ఆరోపణలు చేస్తున్నారు చాలా మంది నటీమణులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా మీటూ ఉద్యమం పై స్పందించారు, ఈ నేపథ్యంలో ప్రీతి జింటా కొన్ని సెన్సషనల్ కామెంట్స్ చేసింది.

మీటూ పై మాట్లాడుతూ ” కొంత మంది మీటూ ను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని, నిజంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారి పరిస్థితి చాలా బాధాకరం అని అన్నారు. అయితే ఈ లైంగిక వేధింపుల సమస్య ప్రతి ఇండస్ట్రీలో ఉండేదే అన్నారు. సినీ ఇండస్ట్రీలో దీని ప్రభావం కొంచమే ఉన్నప్పటికీ కొంత మంది పనికట్టుకు సినీ ఇండస్ట్రీని ఈ వివాదం లోకి లాగుతున్నారని అన్నారు. మీకు కూడా మీటూ అనుభవం ఉందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ” నేను పని చేసిన దర్శకులు, హీరోలు అందరు మంచివారు, నాకు అలాంటి అనుభవాలు లేవు, బహుశా ఉండాలాల్సిందేమో” అంటూ సమాధానం ఇచ్చింది. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పద్దతి ఇది కాదంటూ ప్రీత్ అభిప్రాయం పడింది. ప్రీతి కామెంట్స్ పై బాలీవుడ్ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.