గెలిస్తే.. గుర్తుండిపోయేలా ఒకటి ఇచ్చేస్తా: ప్రీతి జింతా

Monday, April 23rd, 2018, 02:24:22 PM IST

ఇండియన్ క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ఐపీఎల్ ను చాలా బాగా ఏంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క జట్టు ఈ సీజన్ లో గట్టిపోటీని ఇస్తున్నాయి. అయితే ఇంతవరకు ఐపీఎల్ ట్రోపిని అందుకోని పంజాబ్ జట్టు ఈ సారి అందుకుంటుందా అనే సందేహం అందరిలోను నెలకొంది. గత కొన్ని మ్యాచ్ లను చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువగా పంజాబ్ జట్టు మంచి విజయాలతో దూసుకుపోతోంది. అశ్విన్ నేతృత్వంలో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో ఆ జట్టు నాలుగు విజయాలను నమోదు చేసుకుంది.

ఓపెనర్లు గేల్ మరియు కెఎల్.రాహుల్ అద్భుతమైన ఆటతీరును చూస్తుంటే పంజాబ్ 2018 కప్ కొట్టేలా ఉంది. వీరిద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా క్రిస్ గేల్ ఇంతవరకు నిరాశపరచలేదు. అయితే జట్టు ఫైనల్ లో గెలిస్తే యజమాని ప్రీతి జింటా ఆటగాళ్లకు ఎప్పటికి గుర్తుండిపోయే ఒకటి చేస్తానని చెబుతోంది. అదేమిటని అడిగితే.. ఇప్పుడే చెప్పను. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇప్పుడు మంచి విజయాలతో దూసుకుపోతోంది. ఇదే లెవెల్లో ప్రతిభను కనబరుస్తూ 11వ సీజన్ కప్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు తెలుపుతూ.. ఫైనల్ విజయం తరువాత ఆ స్పెషల్ అందరికి తెలుస్తుందని ప్రీతీ జింతా తెలిపింది.