నాకు ముంబై అంటే కోపం లేదు: ప్రీతి జింటా

Tuesday, May 22nd, 2018, 09:13:49 PM IST


ఇటీవల ప్రీతీ జింటా కు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరీనా సంగతి తెలిసిందే. ముంబై – ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఓటమి చెందాలని ప్రీతి సంబరపడినట్లు ఉన్న ఆ వీడియో అందరిని ఆశ్చర్యపరచింది. ఎందుకంటే ముంబై ఓడిపోతేనే ప్రీతీ పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు ఈజీ అవుతుంది. అయితే ఎవరు ఊహించని విధంగా పంజాబ్ తరువాత మ్యాచ్ లో ఓటమి చెంది ఇంటి దారి పట్టింది.

అయితే వైరల్ అయినా వీడియో గురించి ప్రీతీ తనదైన శైలిలో స్పందించింది. అనవసరంగా మీడియానే ఈ విషయాన్ని ఎక్కువగా చేసి. అర్ధం లేకుండా వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జట్టు యజమానురాలిగా పంజాబ్ జట్టు గెలవాలనే అనుకుంటాను. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే ముంబై ఒడితేనే కరెక్ట్ కాబట్టి అలా కోరుకోవడంలో తప్పేముంది. నా స్థానంలో ఎవరున్నా అలానే కోరుకుంటారు. ముంబై పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని ప్రీతి జింటా వివరణ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments