వీడియో : ప్రీతీ కోరిక రివర్స్.. చివరకు దొరికిపోయింది!

Monday, May 21st, 2018, 03:26:09 PM IST

ఎదుటోడు ఓడిపోవాలని కోరుకుంటే తిరిగి వారి దగ్గరికే ఓటమి వస్తుందని అనేక సూక్తుల్లో అర్దాన్ని వినే ఉంటారు. నిజ జీవితంలో అప్పుడపుడు కొన్ని ఉదాహరణలు కూడా మన ముందు దర్శనమిస్తుంటాయి. అదే తరహాలో రీసెంట్ గా ఐపీఎల్ సందర్బంగా అందరికి కనిపించింది. అది కూడా ప్రీతి జింటా ద్వారా కావడంతో ఆ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. నిన్న ముంబై – ఢిల్లీ జట్ల మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై 11 పరుగుల తేడాతో ఓడింది. అయితే పంజాబ్ – చెన్నై మ్యాచ్ జరుగుతుండగా ముంబై ఓడినందుకు సంబరపడుతున్నట్లు ప్రీతి జింతా కనిపించడంతో అందరు షాక్ అయ్యారు. ముంబై ఓడితే ప్లే ఆఫ్ కు మార్గం సుగమం అవుతుందని భావించిన ప్రీతీ చివరికి తన జట్టు వల్లే నిరాశపరిచారు. చెన్నై చేతిలో పంజాబ్ ఓడింది. ముంబై ఓడినందుకు చాలా హ్యాపీగా ఉందని ప్రీతీ ఒక వ్యక్తితో నవ్వుతు హై ఫై ఇవ్వడంతో అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments