ప్రీమియర్ షో టాక్ : ఆఫీసర్

Friday, June 1st, 2018, 02:05:43 PM IST


అక్కినేని నాగార్జున హీరోగా చాలా గ్యాప్ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆఫీసర్. నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్ గా నటిచింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున ఒక కేసును ఛేదించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించారు. నారాయణ్ పరిసా, అజయ్, షాయాజీ షిండే ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో నాగార్జున ఒక పాపకు తండ్రిగా కనిపిస్తారు. తాను చేపట్టిన సిట్ ఆపరేషన్ తనను చంపడానికి కుట్రపన్నిన విలన్ గ్యాంగ్ చేసిన ప్రయత్నంలో నాగ్ అతని భార్యను కోల్పోతాడు. అక్కడినుండి విలన్ నారాయణ్ ను అరెస్ట్ చేయిస్తాడు నాగ్. అయితే తగిన సాక్ష్యాలు, అధరాలు లేక అతడు జైలు నుండి విడుదల చేయబడతాడు. కాగా జరుగుతున్న ఫేక్ ఎన్కౌంటర్లు మీద తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన నాగ్ రకరకాల వ్యక్తులను కలవడం ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. ఇక ఆ తరువాత మెల్లగా అతని గ్యాంగ్ లో చేరి ఒక్కొక్కరినీ చంపుతూ ఉంటాడు.

ఇక కొంత సినిమా తర్వాత నాగ్ కూతురిని అడ్డుపెట్టుకున్న నారాయణ్ ను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తాడు నాగ్. చివరికి హీరో, విలన్ ఒకరికొకరు తారసపడతారు. విలన్లతో జరిగే ఒక భారీ ఫైట్ తర్వాత నారాయణ్ అరెస్ట్ అవడంతో చిత్రం ముగుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ సినిమా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగె సినిమా అని అర్ధం అవుతుంది. రవిశంకర్ సంగీతం బాగుంది, ముఖ్యంగా పాపతో వచ్చే నవ్వే నవ్వు సాంగ్ చాలా బాగుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ కొన్ని సన్నివేశాల్లో అలరిస్తుంది. సినిమాలో యాక్షన్ కు పెద్ద పీట వేయడంతో ఎంటర్టైన్మెంట్ సినిమాలో కొరవడింది. వర్మ టేకింగ్ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బాగా ఎలివేట్ అయింది. మొత్తంగా చూస్తే ఆఫీసర్ సినిమా నాగార్జున కెరీర్ లో మంచి చిత్రం గానే నిలుస్తుంది. అయితే కేవలం యాక్షన్, అండ్ ఎమోషన్ మాత్రమే కలగలిసివున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏవిధంగా ఆదరిస్తారు అనేది వేచి చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments