ప్రీమియర్ షో టాక్ – పంతం – మెసేజ్ మిక్స్ చేసిన సోషల్ డ్రామా!

Thursday, July 5th, 2018, 08:35:37 AM IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నూతన దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో నేడు విడుదలవుతున్న చిత్రం పంతం. కేక్ రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. లౌక్యం చిత్రం తరువాత గోపిచంద్ నటించిన చిత్రాలేవీ కూడా విజయాన్ని అందుకోలేదు. కావున అయన ఎలాగైనా తన అభిమానులకు, ప్రేక్షకులకు మంచి విజయాన్ని అందించాలనే తపనతో ఈ చిత్రాన్ని చేసినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రం గోపీచంద్ సినీ కెరీర్లోని ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్ర ప్రీమియర్ షో ఎలా ఉందొ చూద్దాం. విక్రాంత్ (గోపీచంద్) అనే యువకుడు తన గ్యాంగ్ లతో కలిసి ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో దొంగతనాలు చేస్తూ వుంటాడు. అయితే వారు హోమ్ మినిస్టర్ నాయక్ (సంపత్) ఇంట్లో ఒక భారీ చోరీకి పాల్పడగా, ఘటనకు కారకులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో గోపీచంద్ గ్యాంగ్ లోని కొందరు సభ్యులను నాయక్ పట్టుకుంటాడు.

అయితే వారిని విడిపించడానికి వచ్చిన విక్రాంత్ అసలు ఐడెంటిటీ తెలుసుకుని షాకైన మంత్రి, అసలు ఈ విక్రాంత్ ఎవరు, ఎందుకు ఇలా రాజకీయ నేతల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు, దేనికోసం ఇదంతా చేస్తున్నాడు అని తెలుసుకునే క్రమంలో జరిగేదే అసలు కథ. ఇక్క హీరోయినిగా నటించిన మెహ్రీన్ తన పాత్రమేరకు బాగానే నటించింది. మొదటి చిత్రంతోనే ఒక సోషల్ మెసేజి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు చక్రవర్తి చాలావరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథ కథనాన్ని నడిపించే తీరులో అక్కడక్కడా కొన్ని బోర్ సన్నివేశాలు, మరియు ఇటువంటివి అవసరమా అనిపించే సన్నివేశాలు ఉన్నపటికీ మొత్తంగా చూస్తే పంతం చిత్రాన్ని ఆయన బాగానే తెరకెక్కించారని చెప్పవచ్చు. ఇక చిత్రానికి కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాటలు పర్వాలేదనిపిస్తాయి, ఫోటోగ్రఫీ మరియి సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక చెప్పుకోవలసింది హీరో గోపీచంద్ నటన గురించి. మంచి వేరియేషన్స్ వున్న పాత్రలో నటించిన గోపి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారనే చెప్పుకోవాలి.

కామెడీయన్ పృథ్వి, శ్రీనివాస రెడ్డి, గోపీచంద్ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. జయప్రకాష్ రెడ్డి కూడా తన పార్థలో నవ్వులు పూయించారు. ఇకపోతే నిర్మాత కేకె రాధా మోహన్ చిత్రాన్ని బాగా లావిష్ గా నిర్మించారు. ఇతర పాత్రలో నటించిన సంపత్, షాయాజీ షిండే, తనికెళ్ళ భరణిలు తమపాత్రలలో వొదిగిపోయారనే చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తే హీరో హీరోయిన్ల మధ్య సరైన రొమాంటిక్ సన్నివేశాలు లేకపోవడం, పెద్దగా ఆకట్టుకొని పాటలు, కొంత సాగదీసినట్లు వుండే సెకండ్ హాఫ్. ఇవి మినహాయించి చూస్తే ఈ పంతం చిత్రం హీరో గోపీచంద్ నటన, మంచి యాక్షన్ సన్నివేశాలు, అలరించే కామెడీ, సినిమాలోని పాయింట్, చివర్లో వచ్చే కోర్ట్ సన్నివేశాలు ప్రధాన బలంగా నిలిచి చిత్రాన్నియావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ స్థాయికి తీసుకెళ్లాయి. కాగా రెగ్యులర్ ఫార్మటు లో మంచి మెసేజి తో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పవచ్చు….

  •  
  •  
  •  
  •  

Comments