ప్రధాని మోడీ ఓ పిరికిపంద : టిడిపి మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

Wednesday, April 4th, 2018, 04:05:33 AM IST

విభజన హామీలు నెరవేర్చడంలో, అలానే ఏపీ కి నిధుల విషయంలో బీజేపీ తీరుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఏపీ టీడీపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీని అలానే కేంద్ర బిజెపి పార్టీని పలువిధాలుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు బిజెపి నేతలు సోము వీర్రాజు, హరిబాబు వంటి నేతలు వారికీ గట్టిగ సమాధానం చెపుతున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఢిల్లీ లో పార్లమెంట్ ఆవరణలో ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వనందుకుగాను, బిజెపికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు టీడీపీ మంత్రి జవహర్ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత పిరికిపంద అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు ఓ తెలుగు న్యూస్ ఛానల్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,

ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు చేయాలని చేస్తే కుదరదని, బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారని మోదీపై ఆయన మండిపడ్డారు. బీజేపీ కొత్త స్నేహం కుదుర్చుకుందని, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సైతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన నిప్పులు చెరిగారు. ఏపీకి ఈ రెండు పార్టీలు అన్యాయం చేశాయని అన్నారు. అమితాషా, అరుణ్ జైట్ల్య్ వంటి బడా నేతలు ఏపీ ని నిలువునా ముంచారని, మాకు ఇంత అన్యాయం జరుగుతున్న మోడీ మాత్రం అలా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవలసిందే అని ఆయన దుయ్యబట్టారు…..

  •  
  •  
  •  
  •  

Comments