విదేశీ పర్యటనల కోసం ప్రధాని భారీ ఖర్చు

Monday, June 10th, 2013, 01:21:07 PM IST


గత తొమ్మిదేళ్లలో ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వివిధ విదేశీ పర్యటనల కోసం వెచ్చించిన వ్యయం 642 కోట్లుగా లెక్కగట్టారు. ఇంతవరకు ఆయన 67 విదేశీ పర్యటనలు చేయగా అరవై రెండు పర్యటనలకు అయిన ఖర్చు వివరాలు వెల్లడించారు. మన్మోహన్ సింగ్ గత తొమ్మిదేళ్లలో చేసిన విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వం 642 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

2004లో ప్రధానిగా పగ్గాలు అందుకున్న మన్మోహన్ అప్పటి నుంచి మొత్తం 67 సార్లు విదేశాల్లో పర్యటించారు. వీటిలో 62 పర్యటనల ఖర్చు 642 కోట్లు కాగా.. మరో ఐదు పర్యటనల బిల్లులు అందాల్సి ఉందని పీఏంవో తెలిపింది. 2012లో జీ20, రియోప్లస్20 సదస్సుల కోసం మెక్సికో, బ్రెజిల్‌లో వారం రోజులు పర్యటించినప్పుడు అత్యధికంగా 27 కోట్లు ఖర్చు చేశారు.

ఇక రెండో ఖరీదైన పర్యటనగా 2010 నాటి అమెరికా, బ్రెజిల్ పర్యటన నిలిచింది. అణు భద్రత, బ్రిక్స్ తో పాటు ఇతర సదస్సులకు హాజరయ్యేందుకు చేపట్టిన ఆ పర్యటన కోసం 22.7 కోట్లు వెచ్చించారు. సమాచార హక్కు చట్టం కింద ప్రధాని విదేశీ టూర్ వివరాల్ని పీఎంవో తెలిపింది.