ఖైదీ ఖరీదైన బర్త్ డే వేడుకలు….!

Monday, July 30th, 2018, 05:10:14 PM IST

ఏదైనా నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలులో జీవించే జీవన విధానం చాలా దారుణంగా ఉంటుందని, అయితే శిక్ష పడ్డాక అది తప్పదు కాబట్టి ఎటువంటి ఖైదీ అయినా దానిని అనుభవించక తప్పదు అనేది అందరికి తెలిసిందే. అయితే అక్కడడక్క కొన్ని జైళ్లలో ఖైదీలకు కొన్ని జైళ్లు టివి, పేపర్ వంటి చిన్న సౌకర్యాలు కల్పిస్తూ, వారికీ కొంత ఊరటనివ్వడం మనం విన్నాము. ఇక ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయంలో ఒక ఖైదీ గారు తన పుట్టిన రోజు వేడుకల కోసం దండిగా పోలీస్ బాసులకు డబ్బు ముట్టచెప్పి మరీ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫజియాబాద్ జైల్లో శివేంద్ర అనే ఒక ఖైదీ కొన్నాళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా మొన్న 23వ తేదీన అతడి పుట్టినరోజు కావడంతో ఎలాగైనా ఆ పుట్టిన రోజును జైలు ఖైదీలు మరియు అధికారుల సమక్షంలో ఘనంగా చేసుకోవాలని భావించిన అతడు, జైలు ఉన్నత అధికారులను సంప్రదించి విషయంచెప్పాడు. ఎలాగోలా వారు కూడా చివరకు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ వేడుకలకు తాను ఏకంగా రూ.1 లక్ష పోలీస్ లకు సమర్పించినట్లుగా సమాచారం. వాస్తవానికి ఇటువంటి ఘటనలు జైళ్లలో గోప్యంగా జరుగుతుంటాయి. అయితే అయితే అక్కడి జైలు అధికారుల్లో ఒకరు అతను పుట్టిన రోజు కేక్ కట్ చేసి అందరికి తినిపిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. ఇక ప్రస్తుతం ఆ వీడియోని తలీలకిస్తున్న నెటిజన్లు, ఆ ఖైదీగారి పుట్టినరోజు వేడుకలపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది….

  •  
  •  
  •  
  •  

Comments