సచిన్ తర్వాత అంతటి అరుదైన రికార్డు సృష్టించిన పృథ్వీ షా.!

Thursday, October 4th, 2018, 02:56:47 PM IST

ఇటీవలే ఆసియ కప్ మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసిన భారత జట్టు ఈ రోజు నుంచి కరేబియన్స్ అదే వెస్టిండీస్ తో టెస్టు మ్యాచుల్లో తలపడనున్న సంగతి తెలిసినదే.అయితే ఈ మ్యాచులకు ఇప్పటి వరకు విశ్రాంతి తీస్కున్నటువంటి జట్టు సారధి విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్ గా అరంగేట్రం చేశారు.అయితే ఈ మ్యాచులో పృథ్వీ షా అనే ఒక యువ ఆటగాడిని భారత జట్టు లోకి తీసుకున్నారు.ఈ రోజు రాజకోట్ లోని విండీస్ తో జరిగిన మ్యాచులో ఈ యువ ఆటగాడు ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు.

టెస్టు మ్యాచుల్లో తన ఆరంభ మ్యాచులోనే 100 పరుగులు పూర్తి చేసుకొని,అత్యంత పిన్న వయస్సులో తన శతకాన్ని పూర్తి చేసుకున్న రెండవ బ్యాట్సమెన్ గా రికార్డులకెక్కాడు.పృథ్వీ కన్నా ముందు అత్యంత చిన్న వయసులో శతకాన్ని నమోదు చేసిన బ్యాట్సమెన్ గా క్రికెట్ అభిమానుల ఆరాధ్య దైవం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు.సచిన్ తన 17 ఏళ్ల 107 రోజులకి టెస్టు మ్యాచుల్లో శతకాన్ని నమోదు చేయగా,పృథ్వీ షా తన 18 ఏళ్ల 329 రోజులకి పూర్తి చేసిన రెండో బ్యాట్సమెన్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.అంతే కాకుండా ఆరంభ మ్యాచులోనే శతకం సాధించిన 15వ బ్యాట్సమెన్ గా నిలిచాడు.