ఇండియన్ సినిమాలపై ప్రియాంక వివాదాస్పద వ్యాఖ్యలు ‘

Monday, June 11th, 2018, 09:55:57 PM IST

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల కాలంలో ఇండియాలో కంటే హాలీవుడ్ లోనేఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ ఆఫర్స్ గట్టిగా వస్తుండడంతో అమ్మడు బాలీవుడ్ ఆఫర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ సంగతి అటుంచితే.. ఈ బ్యూటీ రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని హెచ్చరిక చేస్తున్నారు.

ఇటీవల జరిగిన 68వ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక ఎవరు ఊహించని విధంగా ఇండియన్ సినిమాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో తెరకెక్కే సినిమాలు ఎక్కువగా మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టూనే తిరుగుతాయని కామెంట్ చేయడం భారత నెటిజన్స్ ను ఆగ్రహానికి తెప్పిస్తోంది. వెంటనే ఆమె తన మాటలను వెనక్కి తీసుకోవాలని నిప్పులు చెరుగుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments