ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ కన్నుమూత

Monday, June 10th, 2013, 03:22:37 PM IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా కన్నుమూశారు. ఆయన గత కొన్నాళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన అనారోగ్యం మరింత క్షీణించడంతో కూతురు ప్రియంక చోప్రా కొన్ని రోజులుగా అన్ని షూటింగులను రద్దు చేసుకుని హస్పిటల్లోనే ఉంటోంది.

ఇప్పటికే అశోక్ చోప్రాకు పలు సర్జరీలు కూడా జరిగాయి. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలువలేదు. అశోక్ చోప్రా చనిపోయిన విషయాన్ని ఆమె మేనేజర్ ధృవీకరించారు. అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో పిజీషియన్‌గా పని చేసారు. వృత్తి రీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో పని చేసారు. తండ్రి మరణంతో ప్రియాంక చోప్రా కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది.