ప్రియాంక ఎంట్రీ పై హింట్ ఇచ్చిన రాహుల్ !

Sunday, October 28th, 2018, 01:10:24 PM IST

జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ ను కొన్నేళ్ల పాటు తిరుగులేని శక్తిగా నడిపిన సోనియా గాంధీకి మహిళల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి కట్టబెట్టి, ఇతర కీలక వ్యవహారాలకు పరిమితమైన సోనియా త్వరలోనే ప్రియాంక గాంధీని సైతం ప్రత్యేక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చాలని భావిస్తోందట.

ప్రియాంక గాంధీకి రాహుల్ తో సమానమైన క్రేజ్ లేకపోయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే ఆమెకు ప్రజల్లో ఉన్న పేరు చెప్పుకోదగినదే. ముఖ్యంగా రాయ్ బరేలి, అమేథిలలో ప్రియాంకకు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తరచూ ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటారామె.

వాగ్దాటి, ఆకట్టుకునే వర్ఛస్సు మాత్రమే కాదు సోనియా మాదిరిగానే రాజకీయంగా జ్ఞానం కూడ ఆమెకు పుష్కలంగా ఉందని అంటుంటారు కాంగ్రెస్ పెద్దలు. 2004లో తల్లి సోనియాకు క్యాంపైనింగ్ మేనేజర్ గా వ్యవహరించిన ప్రియాంక 2007 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి చాలా సహాయం చేశారు. ఇప్పుడు ఈమెను రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన భాగం చేయాలని సోనియా, రాహుల్ భావిస్తున్నారట. ఇదే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో చూచాయిగా తెలిపారు రాహుల్. ప్రియాంక కూడ తల్లి సోనియా అభిప్రాయం పట్ల సుముఖంగానే ఉందట.

  •  
  •  
  •  
  •  

Comments