రెడ్‌మీ నోట్ 5తో కొత్త ప్రమాదాలు వస్తున్నాయి… జాగ్రత్త

Monday, March 12th, 2018, 03:06:27 PM IST

గత కొద్దికాలంగా రెడ్‌మీ ఫోన్ లకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. కానీ తాజాగా లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్ లు వినియోగదారులను ముప్పు తిప్పలు పెదుతున్నాయి. చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ మొబైల్స్ తయారీదారు షియోమీ ఈ మధ్యే తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొలను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లను కొన్ని లక్షల మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. అయితే వీటిల్లో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సమస్యలు బాగా వస్తున్నాయని తెలిసింది. ఇటివల హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నప్పుడు వీటిల్లో తక్కువ సౌండ్ వినిపిస్తుందని ఫిర్యాదులు వెల్లువెత్తగా షియోమీ స్పందించి అందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం మరిన్ని సమస్యలు ఈ ఫోన్లలో ఉత్పన్నమవుతున్నాయి.

రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లలో మోడ్రన్ కోంబాట్ 5, బియా 3, స్నిపర్ ఫ్యురీ వంటి గేమ్స్‌ను ఆడుతున్నప్పుడు ఫోన్‌కు గేమ్ ప్యాడ్‌ను కనెక్ట్ చేయకపోయినా గేమ్ పాడ్ కనెక్ట్ చేసినట్టు ఫోన్‌లో వస్తున్నదని, దీంతో ఫోన్‌లో ఉండే కంట్రోల్స్ డిసేబుల్ అవుతున్నాయని, ఫలితంగా స్క్రీన్‌పై గేమ్ ప్యాడ్ కంట్రోల్స్‌ను ప్రెస్ చేయాలని మెసేజ్ కనిపిస్తుందని యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గేమ్‌లను ఆడలేకపోతున్నామని వారు అంటున్నారు. అలాగే మరికొందరు యూజర్ల ఫోన్లలో జైరోస్కోప్ సెన్సార్ పనిచేయడం లేదని, ఫ్రంట్ కెమెరాతో ఫొటోలు తీస్తే బ్లాక్ ఫొటో వస్తుందని వాపోతురు. అలాగే కొందరికి చెందిన రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లు వాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్క్రీన్ లాక్ అవుతున్నాయని చెబుతున్నారు. దీనిపై యూజర్లు ఇప్పటికే ఎంఐ కమ్యూనిటీ ఫోరంలో ఫిర్యాదులను పోస్టు చేయగా అందుకు షియోమీ ఇంకా స్పందించకపోవడం సమంజసం కాదని వినియోగదారులు అసంతృప్తి చెందుతున్నారు. కాగా ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్స్‌లలో యూజర్లకు ప్రత్యేకంగా లభిస్తుండగా వీటికి గాను ఎల్లుండి మధ్యాహ్నం మరో ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనున్నారు. అయితే ఈ ఫోన్లను వాడుతున్న వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను షియోమీ పరిష్కరిస్తుందా లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments