టీడీపీ తొలి జాబితాలో భ‌వ్య ప్ర‌సాద్‌

Tuesday, November 13th, 2018, 09:00:18 AM IST

ఎట్ట‌కేల‌కు మ‌హాకూట‌మి లెక్క‌తేలింది. కాంగ్రెస్ 65 మందితో తొలి జాబితాను విడుదల‌ చేయ‌గా టీటీడీపీ 9 మంది అభ్య‌ర్థుల్ని ఖ‌రారు చేస్తూ తొలి జాబితాను విడుద‌ల చేసింది. మొత్తం 14 స్థానాల‌కు గానూ తొలి జాబితాగా 9 మందిని ప్ర‌క‌టించింది. ఇందులో బాల‌కృష్ణ‌తో `పైసా వ‌సూల్‌` చిత్రాన్ని నిర్మించిన భ‌వ్య అనంద్ ప్ర‌పాద్‌కు చోటు ద‌క్క‌డం విశేషం. శేరిలింగంప‌ల్లి నుంచి భ‌వ్య ఆనంద్ ప్ర‌ప‌సాద్ అనుహ్యంగా పోటీకి దిగాడు.

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భ‌వ్య ప్ర‌సాద్ ఇక్క‌డి నుంచి టీడీపీ టికెట్ ఆశించ‌డంతో శేరిలింగంప‌ల్లి టీడీపీలో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయినా స‌రే అత‌నికే టికెట్‌ను కేటాయించ‌డం వెనుక బాల‌కృష్ణ హ‌స్తం వుంద‌ని, ఆయ‌న వ‌ల్లే ఆనంద్‌ప్ర‌సాద్‌కు టికెట్ కేటాయించారని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. టీడీపీ విడుద‌ల చేసిన 9 మంది జాబితాలో ఎక్కువ మంది సీనియ‌ర్ నేత‌లే వుండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఇందులో న‌ర్సంపేట నుంచి పోటీకి దిగాల్సిన రేవూరి ప్ర‌కాష్‌రెడ్డిని వ‌రంగ‌ల్ ప‌శ్చిమానికి మార్చారు. ఇక టీడీపీ సీనియ‌ర్ నేత దేవేంద‌ర్‌గౌడ్ కుమారుడి వీరేంద‌ర్ గౌడ్ కు ఈ సారి టికెట్ ఇచ్చారు. ఆయ‌న ఉప్ప‌ల్ నుంచి బ‌రిలోకి దిగుతున్నారు. ఖమ్మం నుంచి ఎప్ప‌టిలాగే నామా నాగేశ్వ‌రరావు పోటీప‌డుతుండ‌గా ఒటుకు నోటులో బుక్క‌యిన సండ్ర వెంక‌ట వీర‌య్య స‌త్తుప‌ల్లి నుంచి మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. టీడీపీ మ‌లిజాబితాగా మ‌రో 5స్థానాల్ని ప్ర‌క‌టించాల్సి వుంది. ఆ త‌రువాతే రెబెల్స్ రంగంలోకి దిగుతార‌ని తెలుస్తోంది.

 

టీటీడీపీ తొలి జాబితా ఇదే..

  • 14
  •  
  •  
  •  

Comments