కాంగ్రెస్ పార్టీలోకి .. నటుడు నిర్మాత బండ్ల గణేష్ ?

Friday, September 7th, 2018, 03:30:33 PM IST

తాజాగా మరో సినీ నటుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కమెడియన్ గా తెలుగు తెరపై పలు చిత్రాల్లో నటించి ఆ తరువాత నిర్మాతగా భారీ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్. తాజాగా అయన కాంగ్రెస్ పార్టీ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మద్యే రాహుల్ గాంధీ ని కూడా కలిసినట్టు తెలుస్తోంది. సినిమా రంగంలో భారీ నిర్మాతగా పేరు తెచ్చుకున్న గణేష్ కు అటు రాజకీయ పరంగా కూడా మంచి సంబంధాలున్నాయి. రాహుల్ గాంధీ తో బండ్ల గణేష్ కు మంచి అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను పురస్కరించుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. బండ్ల గణేష్ షాద్ నగర్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఒక వేళా కాంగ్రెస్ పార్టీ లో చేరితే ఆయనకు షాద్ నగర్ నియోజక వర్గం తరపున ఎం ఎల్ ఏ గా పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments