24 గంటల్లోగా సినీ పెద్దలు స్పందించాలి.. లేకుంటే: సినీ నిర్మాత

Friday, May 11th, 2018, 12:15:24 AM IST


ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంపై రాజకీయాల్లో ఎలాంటి వివాదాలు చెలరేగుతున్నాయో అందరికి తెలిసిందే. ముందుగా ఈ విషయంపై స్పందించమని చాలా మంది నేతలు సినిమా తారలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు సినిమాకు చెందిన సభ్యుడే ప్రత్యేక హోదా విషయంలో సినీ పెద్దలకు హెచ్చరిక జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది రీసెంట్ గా నిర్వహించిన మీడియా సమావేశంలో సినీ నిర్మాత యలమంచి ప్రత్యేక హోదా కొరకు స్పందిచకపోవడంపై రవిచంద్ విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణమని చెబుతూ.. ప్రత్యేక హోదా ఉద్యమంపై 48 గంటల్లోగా స్పందించాలని తెలిపారు. ఇటీవల మా అసోసియేషన్ కు లేఖ రాశాము. తెలుగు ప్రజలు సినీ పెద్దలు హీరోలు దర్శకులు ఎందుకు స్పందించడం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పన్ను రాయితీ పొందుతున్న సినీ పరిశ్రమకు దాదాపు ఒక ఏడాదిలో 1000 కోట్లు వస్తున్నాయని వివరణ ఇచ్చారు. ఫైనల్ గా మరో 24 గంటల్లో ప్రత్యేక హోదాపై స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రవి చందర్ చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments