ప్రొఫెసర్ కోదండరాం సంచలన నిర్ణయం- అనూహ్యంగా ఆఖరి క్షణాన హామీ

Thursday, December 6th, 2018, 04:00:32 AM IST

మరో రెండు రోజుల్లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి నేటితో ప్రచార కార్యక్రమాలు ముగిసిపోయాయి. నాయకులు, అభ్యర్థులు అందరు చాలా కష్టపడి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి మనకి తెలిసిందే. కానీ, తెలంగాణ అంజనా సమితి అధ్యక్షుడు కోదండరాం మాత్రం ప్రచారం లో ఎక్కువగా కనబడలేదు. దీనికి కారణం కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన లక్ష్యం అంటున్నాడు కోదండరాం. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాకూటమి బాగా పుంజుకొంది.దీనికి కారణం వాళ్ళు చేపట్టిన ప్రచార కార్యక్రమాలు మాత్రమే. కెసిఆర్ ఉన్నపలంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి వెళ్ళినప్పుడు, ఎన్నికలు జరిగిన తరువాత మల్లి తెరాస ప్రభుత్వమే అధికారం లోకి వస్తుందనే టాక్ బాగా ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ కాంగ్రెస్, టీ టీడీపీ, టీజెఎస్, సీపీఐ లు ప్రజా కూటమిగా ఏర్పడంతో తెలంగాణా లో వ్యావతా అంత మారిపోయింది. తెలంగాణాలో రాహుల్, సోనియాగాంధీ, చంద్రబాబు ప్రచారంతో ప్రజాకూటమి గెలిచే అవకాశాలు పెరుగుతూ పోతున్నాయి. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కూడా నిర్వహించిన సర్వేలో ప్రజకూటమి గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

కానీ కూటమి చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో మాత్రం ప్రొ. కోదండరామ్ కోలక పాత్ర పోషించారు. తాను ఎన్నికల ప్రచారం లో పెద్దగా కనిపించకపోయినప్పటికిని, ఈ ప్రజకూటమి ఏర్పడటంతో మాత్రం తనదే ముఖ్యపాత్ర అని చెప్పుకోవచ్చు. తెలంగాణా ఉద్యమ సమయంలో కోదండరాం, తెలంగాణ రాజకీయ జేఏసీ నడిపిన అనుభవంతో ప్రజాకూటమిలో కీలక పాత్ర వహించాడు కోదండరాం. ఇక, ప్రజా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, కూటమి చేసిన హామీలన్నిటిని అమలు చేసే బాధ్యత నాదేనని, ఆ విషయం లో మీరు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకండి అని కోదండరాం తెలిపారు.