చక్రి మృతి పట్ల ప్రముఖుల దిగ్బ్రాంతి!

Monday, December 15th, 2014, 10:40:48 AM IST

chakrii
తెలుగు చిత్రసీమ ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి అపోలో హాస్పిటల్ లో ఈ రోజు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా చక్రి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే తన కెరీర్ లో ఎన్నో విజయాలను సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ చక్రి తనువు చాలించడం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని కెసిఆర్ ఆకాంక్షించి అతని కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

ఇక చక్రి ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ,, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. చక్రి మరణంతో తెలుగు చిత్ర సీమ ఒక గొప్ప సంగీత దర్శకుడిని కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలు చక్రి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసి అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.