జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45లో అన్యాయంగా ఆస్తులు సేకరిస్తున్నారు…

Saturday, March 10th, 2018, 03:47:01 PM IST

అడుగడునా అభివృద్ధి నెపంతో ఆస్తుల సేకరణ, ఎదేమిటంటే అంతా మీకోసమే అంటూ కల్లబొల్లి మాటలు. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45లో ఆస్తుల సేకరణ చర్చనీయంశంగా మారుతోంది. ప్రస్తుతం తరుణంలో 80 అడుగులు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలన్న జీహెచ్‌ఎంసీ నిర్ణయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ అభివృద్ధి మాకు అవసరం లేదంటూ వాపోతున్నారు. ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేసిన అధికారులు.. అభివృద్ధి బదలాయింపు హక్కులో భాగంగా సెట్‌ బ్యాక్‌ల మినహాయింపుతోపాటు అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఇస్తామని చెబుతున్నారు. ఆస్తుల సేకరణ చట్టం 2013 ప్రకారం ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ ధరకు రెట్టింపు స్థలం, నిర్మాణ(స్ట్రక్చరల్‌ వాల్యూ) విలువ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా ఉందంటున్నారు. నివాస జోన్‌లో ఉన్న రహదారిని వాణిజ్య రహదారిగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించామని దానికి అందరు కట్టుబడి ఉండాలని, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకోవచ్చని బంపర్ ఆఫర్‌ ఇచ్చారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45 వాసులు అభ్యంతకరం వ్యక్తం చేస్తున్నారు. ‘మాకు ఎలాంటి సెట్‌బ్యాక్‌లు వద్దు. అదనపు అంతస్తులు వద్దు ప్రస్తుతం ఉన్న భవనాలు చాలు, కొత్త సమస్యలు మాకు తెచ్చి పెట్టకండి  అంటూ తగాదానికి దిగుతున్నారు’. ప్రస్తుతం ఉన్న భవనాలలో ప్రశాంతంగా జీవించేందుకు నిబంధనల ప్రకారం కట్టుకున్న ఇళ్లను అలా ఉంచితే చాలు’ అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పరిహారం, టీడీఆర్‌ వంటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏం చేయాలన్న దానిపై అధికారులు అతలాకుతలం అయిపోతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జూబ్లీహిల్స్‌ సొసైటీలో ప్లాట్లు కొనుక్కున్న చేసిన మాజీ ఐఏఎస్లు, రిటైర్డ్‌ న్యాయమూర్తులు, వైద్యులు, ఇతరితర ఉన్నతాధికారులు, వ్యాపారులు ఈ మార్గంలో ఇండ్లను నిర్మించారు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ, దివంగత నటుడు శ్రీహరి నివాసం కూడా ఇదే రోడ్డులో ఉంది. రోడ్‌ నెంబర్‌-45లో గ్రౌండ్‌ ప్లస్‌ ఒకటి కంటే ఎక్కువ అంతస్తుల్లో ఉన్న ఇళ్లు తక్కువ. 80 అడుగులుగా ఉన్న రోడ్డును ఒక్కో వైపు 20 అడుగుల మేర విస్తరిస్తే ప్రహారీలతోపాటు కొన్ని ఇళ్లు కూడా కూల్చి వేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది.

ఇక ఏకంగా కొన్ని ఇళ్ల పిల్లర్లు కూడా తొలగించాల్సి ఉంటుంది. అదే జరిగితే మొత్తం భవనం నిర్మాణంపై ప్రభావం పడుతుందని వారు చెబుతున్నారు. ఇక్కడ 121 ఆస్తులు సేకరించాల్సి ఉంటుందని పట్టణ ప్రణాళికా విభాగం అధికారొకరు తెలిపారు. ఇందులో కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా మేము ఆస్తులు ఇవ్వడానికి సిద్దంగా లేమని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45 ప్రాంత వాసులు వెల్లడించారు.

అయితే అక్కడి సమీప ప్రాంతంలోని శ్రీహరి ఇంటి నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ యూవర్సిటీ వరకు ప్రస్తుతం ఫ్లై ఓవర్‌ నిర్మిస్తున్నారు. దుర్గం చెరువుపై ప్రారంభమైన ఈ కేబుల్‌ స్టే బ్రిడ్జి పనులు పూర్తయితే.. రోడ్‌ నెంబర్‌-45లో నిర్మించే బ్రిడ్జి మీద నుంచి నేరుగా గచ్చిబౌలి, ఖాజాగూడ, ఐటీ కారిడార్‌ వైపు రాకపోకలు సులువవుతాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉన్న రోడ్‌ నెంబర్‌-36కు సమాంతరంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అసలే ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు ఉక్కిరి బిక్కిరిగా ఉన్నాయి. కేబుల్‌ స్టే బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుచూపుతో ఫ్లై ఓవర్‌ నిర్మించాలని నిర్తారించమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 120 అడుగుల మేర రోడ్డు విస్తరించాలని భావిస్తుండగా.. స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. 80 అడుగుల రహదారి సరిపోతుందని, తప్పదనుకుంటే ఒక్కో వైపు ఐదు నుంచి పది అడుగుల మేర(100 అడుగుల వరకు) విస్తరిస్తే ఓకే అని కొందరు చెబుతున్నారు.

ఇంతటి చర్చలు జరుగుతూ విఫలమవుతూ ఏమవుతుందోనన్న భయంతో ఇటీవల పురపాలక, పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావును రోడ్‌ నెంబర్‌-45 లో నివాసం ఉంటున్న వాళ్ళు కలిసి, 120 అడుగుల మేర రోడ్డు విస్తరిస్తే తమ ఇళ్లు కోల్పోతామని, దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీస్కోని మాకీ సమస్యలు తెచ్చిపెట్తోద్దని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయంపై స్పందించిన కేటీఆర్‌.. ‘కేవలం ప్రహారీల వరకు ఆస్తుల సేకరణ ఉంటుందని మాత్రమే నాకు తెల్సు. ఇళ్లపై ఎఫెక్ట్‌ ఉంటుందని నిజంగా నాకు తెలియదు. ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను పంపి మరోసారి రోడ్ల విస్తరణ ప్రతిపాదనకు సంబందించిన విషయాలను పరిశీలిస్తామని స్థానికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మేము చూస్కుంటామని అన్నారు. మంత్రి ఆదేశాలు తెలుసుకున్న కొందరు అధికారులతో రోడ్‌ నెంబర్‌-45 నివాసితులతో సమావేశం ఏర్పాటుచేసి ప్లాన్‌ను వివరించారు. ఈ సమావేశంలో కూడా ఒక్కోవైపు 20 అడుగుల మేర విస్తరణకు అంగీకరించేది లేదని ఖరాకండిగా తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయాలనూ పరిశీలించాలని, శ్రీహరి నివాసం నుంచి కాకుండా భారతీయ విద్యాభవన్‌ నుంచి ఫ్లై ఓవర్‌ నిర్మిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చే శారు. ప్రస్తుతం చర్చలతోనే సతసతమవుతున్న ఈ అంశం తేలేవరకు ఎవరి ఆస్తులు ఇవ్వడానికి లేదని చెప్పగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి.

ఈ విషయమై కేటీఆర్‌ మాకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటానని చెప్పాడని ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆయన తగిన నిర్ణయం తీసుకుంటున్నారని అనుకుంటున్నామని అన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45 వాసులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాజనకంగా ఉన్నామని వారి భావనని వ్యక్తం చేసారు. అయితే కొందరికి నోటీసులు జారీ చేసిన విషయం నిజమేనని, దాదాపు 21 ఇళ్లపై గట్టి ప్రభావం పడుతుందని. ఫ్లై ఓవర్‌ నిర్మించాక కింద రోడ్డు అంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు కదా? ఇంజనీరింగ్‌ అధికారులు కూడా చేస్కున్న ఆర్కిటెక్ట్ ప్లాన్ ను తిరికి ఒకసారి పరిశీలించి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్కొని మా ఆస్తులు తీస్కోకుండా చూడమని అన్నారు..