14వ ఆర్ధిక సంఘం అలా చెప్పిందని దమ్ముంటే రుజువుచేయండి!

Tuesday, July 24th, 2018, 11:40:43 PM IST

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో దాదాపుగా ఏ నలుగురు మాట్లాడుకుంటున్నా మన రాష్ట్రానికి అసలు ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనే విషయమే మాట్లాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి హోదా విషయమై శ్రాయశక్తుల ప్రయత్నిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లో తమ ప్రాణాలు పణంగా పెట్టి అయినా సరే హోదాను సాధించితీరుతామని టీడీపీ ఎంపీలు అంటున్నారు. నేడు రాజ్యసభలో ఏపీ రాష్త్ర పునర్విభజన చట్టంపై చర్చించిన బీజేపీ ఎంపీలు, మరియు మంత్రులు మాట్లాడుతుంటే టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇక కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, మరియు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లు మాట్లాడుతున్నప్పుడు సీఎం రమేష్ వారి వ్యాఖ్యలపై మండిపడ్డారు. సభలో తెలుగులోనే మాట్లాడిన ఆయన ఆ ఇద్దరు మంత్రులు పూర్తి అసత్యాలు మాట్లాడుతున్నారని, ఓవైపు రాష్ట్రం పరిస్థితి అద్వాన్నంగా ఉందని,

కేంద్రం వారు నిధులిచ్చి మామ్మల్ని మా రాష్ట్రాన్ని ఆదుకుంటారని ప్రజలు ఎదురు చూస్తుంటే, ఇక్కడ వీరు మాత్రం మొదటినుండి చెపుతున్న అవే మాటలు చెపుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రకాష్ జవదేకర్ మాట్లాడిన విద్యాసంస్థల విషయాన్నీ లేవనెత్తిన రమేష్, మా రాష్ట్రంలో విద్య సంస్థల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం రూ.12కోట్లు విలువచేసే స్థలం ఇచ్చిందని, వాటి ఏర్పాటుకు మొత్తం రూ.14,000 కోట్లరూపాయల ఖర్చు అవుతుందని అన్నారు. కాగా ఇప్పటివరకు కేవలం 8 నుండి 9 సంస్థల ఏర్పాటుకు రూ.546 కోట్లు మాత్రమే వెచ్చించారని, అవి ఎలా సరిపోతాయో చెప్పాలని, ఇలాగైతే మా విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇక ఆ పార్టీ వారు చెపుతున్నట్లు 14వ ఆర్ధిక సంఘమే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనవసరం లేదని చెప్పింది అనే వాదనలో ఏ మాత్రం నిజం లేదని, అలా చెప్పింది అనే విషయాన్నీ దమ్ముంటే బీజేపీ నేతలు ఇప్పుడే రుజువు చేయాలనీ ఆయన సభలో డిమాండ్ చేశారు. ఇది అంతా బిజెపి కుట్రలో భాగమని,

దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్చిన్నం చేసి, వాటి మనుగడ లేకుండా పోయేలా చేసి మొత్తం రాష్ట్రాన్ని తామే ఏలుకోవాలని బీజేపీ నాయకులు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. అసలు ఈ విషయంలో యూ టర్న్ తీసుకుంది ఆ పార్టీ అని, మొదట హోదా అన్నారు. ఆ తరువాత హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఇవ్వడంలేదని, ప్రత్యేక ప్యాకెజీ అయితే అంతకు మించి లాభముంటుందని వారు చెప్పడంతోనే ప్యాకెజీకి ఒప్పుకున్నామని, ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ రూపాయి కూడా ఇవ్వకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎలాగని ఆయన వాపోయారు. దేశ ప్రజలు బిజెపికి బుద్ధి చెప్పేరోజు అతి దగ్గర్లోనే వుందని, రాబోయే ఎన్నికలు వారికీ గట్టి గుణపాఠంగా మరితీరుతాయని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments