రేపే పల్స్ పోలియో – రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభం

Saturday, March 9th, 2019, 04:36:21 PM IST


రేపు మనదేశ వ్యాప్తంగా పిల్లలందరికీ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మన రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ప్రారంభించారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 35,12,333 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఆయా విభాగాలకు ఇప్పటికే అవగాహన కల్పించారు. 52,19,180 వ్యాక్సినేషన్ డోస్ లను కూడా సిద్దం చేశారు. రేపు ఉదయమే 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ పల్స్ పోలియో కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది… దేశంలోని చిన్న పిల్లలు అందరికి కూడా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు ఆదేశించారు.