పుల్వామా దాడి కేసులో మరో కొత్త కోణం.. జవాన్ అరెస్ట్ ..!

Friday, May 17th, 2019, 05:06:13 PM IST

గత కొద్ది రోజుల కిందట పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడులలో 40 మంది సైనికులు చనిపోయారు. అయితే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినది పాక్ ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ అని గుర్తించిన ప్రభుత్వం వారి స్థావరాలపై దండెత్తి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌(ఏటీఎస్‌), కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అయితే భారత జవాన్‌గా పనిచేసే అవినాష్ అనే యువకుడు సైనికుల సమాచారాన్ని ఉగ్రమూకలకు తెలియచేసాడు.

అయితే హానీ ట్రాప్‌లో చిక్కిన ఓ భారతసైనికుడు సీఆర్‌పీఎఫ్ కదలికల సమాచారం, సైనికుల సమాచారం తనకు తెలియకుండానే పూర్తిగా ఉగ్రవాదులకు తెలియచేశాడు. స్నూఫింగ్ యాప్‌ ద్వారా ఓ అమ్మాయిలా మాట్లాడి జవాన్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకునట్టు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌(ఏటీఎస్‌) సంస్థ నిర్ధారణకు వచ్చింది. ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలోని బీహార్ రెజిమెంట్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న అవినాష్ కుమార్. 2018లో ఇతడిని అసోంకు బదిలీ చేశారు. అయితే తన తండ్రి కూడా ఆర్మీ జవాన్‌గానే పనిచేసారు. అయితే అమ్మాయితో సోషల్ మీడియాలో సెక్స్ ఛాట్ చేయడంతో పాటు డబ్బుకు కక్కుర్తి పడి భారత సైనిక రహస్యాలను పాక్ ఐఎస్ఐకు అందించాడా అనే కోణంపై కూడా దర్యాప్తు చేపట్టింది. అంతేకాదు పాకిస్తాన్ నుంచి అవినాశ్ బ్యాంక్ ఖాతాలోకి 50 వేలు వచ్చి పడ్డాయని కూడా తేలింది. అయితే ఇది ఎవరు చేసారు అనేదానిపై ప్రస్తుతం అవినాష్‌ను ఆరా తీస్తున్నారు పోలీసులు. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ నిఘా సంస్థ అవినాష్ కుమార్‌ను అరెస్టు చేసి భోపాల్‌లోని స్పెషల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించారు. అంతేకాకుండా అవినాష్ ఇంట్లో తనిఖీలు కూడా జరిపారు. అయితే అదొక్క సమాచారమే అందించాడా లేక ఇంకేమైన సమాచారం అందించాడా అనే దానిపై అవినాష్‌ను ఆరా తీస్తున్నారు.