పూణే వన్డే : మ్యాచ్ కు ముందు ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో తెలుసా..!!

Wednesday, October 25th, 2017, 04:57:04 PM IST

న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా టీం ఇండియా ముంబై వాంఖడేలో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఓటమిపాలైంది. కాగా ఇరుజట్ల మధ్య ప్రస్తుతం పూణేలో రెండవ వన్డే జరుగుతోంది. మ్యాచ్ కు ముందు రెండవ వన్డే జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనికి కారణం పూణే స్టేడియంలో పిచ్ కు సంబంధించి భారీ కుంభకోణం జరగడమే. బీసీసీఐ వర్గాల నిర్ణయం మేరకు మ్యాచ్ కొనసాగింది. పిచ్ కు సంబందించిన వివరాలని బుకీలు అమ్మేస్తూ క్యూరేటర్ పాండురంగ్ అడ్డంగా దొరికిపోయారు. భారీ కుంభకోణానికి సంబందించిన ఆరోణలు రావడంతో బీసీసీఐ క్యూరేటర్ ని సస్పెండ్ చేసింది.

క్రికెట్ కు మచ్చ తీసుకుని వచ్చే ఇలాంటి విషయాలని బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. దీనివెనుక ఎవరెవరు ఉన్నారో వారందరిని బయటకు తీసి కఠినంగా శిక్షిస్తాం అని బీసీసీఐ జాయింట్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి తెలిపారు. ఈ వ్యవహారం పై సుప్రీం కోర్టు సైతం స్టింగ్ ఆపరేషన్ ని నియమించింది. తాము పరిస్థితులని నిశితంగా గమనిస్తున్నామని సి ఏ ఓ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు.

అమ్ముడుపోయి పిచ్ లో మార్పులకు సిద్ధం అంటూ బుకీలు క్యూరేటర్ చెప్పడమే కాకుండా, రిపోర్టర్ ల పేరుతో బుకీలని మైదానంలోకి తీసుకుని వచ్చి పిచ్ ని చూపించాడు. పాండురంగ్ వ్యవహారం ప్రస్తుతం బీసీసీఐలో తీవ్ర కలకలం మారింది. ఇలాంటి క్యూరేటర్ పై జీవిత కాలం నిషేధం విధించాలని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ డిమాండ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments