అప్పుచేసి లాటరీ కొన్నాడు.. జాక్ పాట్ కొట్టేశాడు!

Friday, September 7th, 2018, 11:33:02 AM IST

లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అందుకే ప్రతి క్షణం ఎంత కష్టం ఉన్నా కూడా నవ్వుతు బ్రతికేస్తారు చాలా మంది. ఇక లైఫ్ ఊహించని విధంగా ఒక్క క్షణం చాలు అనే ఉదాహరణలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లాటరీ తగిలింది అంటే ఎలాంటి వారి జీవితమైనా కూడా ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంటుంది. దానికి ఎంతో అదృష్టం ఉండాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇకపోతే రీసెంట్ గా ఒక పేదవాడి తలుపును లాటరీ లక్ష్మి బద్దలుకొట్టేసింది. ఆ లాటరీ కూడా రెండు వందలు అప్పు చేసి కొన్నాడట ఆ వ్యక్తి.

అసలు విషయంలోకి వెళితే.. పంజాబ్‌ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లా మండ్వి గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనగిస్తుంటాడు. అయితే గత నెల అతను ఒక వ్యక్తి దగ్గర 200 రూపాయలు అప్పుచేసి బంపర్-2018 పంజాబ్ స్టేట్ కు సంబందించిన లాటరీ టికెట్ కొన్నాడు. అయితే ఆగస్టు 29న రాఖీ రూ.1.50 కోట్లు గెలుచుకున్న తొలి ఇద్దరి విజేతలను ప్రకటించారు. అందులో ఒకరే మనోజ్ కుమార్. పేదవాడైన తనకు ఈ అదృష్టం దక్కడం చాలా ఆనందంగా ఉందని మనోజ్ తెలిపాడు. అలాగే తన కష్టాలన్నీ నేటితో తీరాయని భావోద్వేగానికి లోనయ్యాడు. బుధవారం పంజాబ్ లాటరీ డైరెక్టర్‌ను కలుసుకుని తన టికెట్‌ను సమర్పించగా.. డబ్బులను వీలైనంత త్వరగా అందజేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments