పునరాలోచనలో పడ్డ పురందేశ్వరి?

Tuesday, May 15th, 2018, 12:30:20 AM IST

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షలు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరమవు గారి తనయ, కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ఏపీ లో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆలోచనలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆమె ఒకప్పుడు కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి గా వున్నపుడు ఏపీ విభజన జరిగింది. అయితే విభజన అనంతరం ఆమె బీజేపీలో చేరి విశాఖపట్నం ఎంపీగా గెలిచి ప్రస్తుతం బిజెపి నేతృత్వంలో కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె విభజన సమయంలో కాంగ్రెస్ తరపున గట్టిగా ఎలా మాట్లాడలేకపోయారో ప్రస్తుత్తం ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పిన ఎన్డీయేలో బీజేపీలో వుండి కూడా ప్రస్తుతం అలానే మాట్లాడలేకపోతున్నారు.

అందుకే ఆమె రానున్న ఎన్నికలపై గట్టిగా దృష్టిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో వైసిపిలో చేరేందుకు ఆమె రంగం సిద్దము చేసుకుంటున్నారని అంటున్నారు. నిజానికి వైసిపి లో చేరినప్పటికీ ఆమె ఎంపీగానే పోటీ చేస్తారని, ఒకవేళ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆమెకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అదే ఒకవేళ బీజేపీలో కొనసాగినప్పటికీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా బిజెపి ఏపీలో బరిలోకి దిగే అవకాశం కనపడుతోంది. అయినా ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఏపీలో టిడిపి, లేదా వైసిపి మాత్రమే గెలవచ్చని కొన్ని సర్వేలు కూడా చెపుతున్నాయి. కాబట్టి అదేకనుక బీజేపీలోనే వుండి ఎంపీగా ఏదో ఒక స్థానం నుండి పోటీ చేసినా ఆమెకు గెలిచే సత్తా ఉందని అంటున్నారు.

ఆమెకు వున్న మంచి పేరు, అనుచరగణం, మంచి రాజకీయ నేపధ్యం ఆమెను తప్పక గెలిపిస్తాయని చెపుతున్నారు. ఒకవేళ ఇక్కడ బిజెపి ఓడిపోయినప్పటికీ, కేంద్రంలో గెలిస్తే ఆమెకు ఇప్పటివలె మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదు. అందువల్ల పార్టీ మారారన్న ముద్రకంటే ఇందులోనే వుండడం మేలనేది కొందరి వాదన. అయితే ఆమె నిర్ణయం మాత్రం ప్రస్తుతం ఇంకా తేలలేదని, అతిత్వరలోనే ఆమె తన నిర్ణయాన్ని మీడియాకు వెల్లడిస్తారని ఆమె అనుచరులు, సన్నిహితులు అంటున్నారు……..