ఏమీ అననట్టే ఎంత మాట అనేశావమ్మా..అంటే చంద్రబాబు..!!

Friday, September 29th, 2017, 08:40:31 AM IST


చంద్రబాబు, పురందేశ్వరి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు. చంద్రబాబు ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతున్న విషయాన్ని పురందేశ్వరి పరోక్షంగా ప్రస్తావిస్తూ లోతైన విమర్శ చేశారు. బిజెపి తెలుగు దేశం పాట్రీ ల మధ్య ప్రస్తుతానికి మిత్రత్వం ఉండడం వలనే పరోక్షంగా వ్యాఖ్యానించారని లేకుంటే ఆ విమర్శల ఘాటు చాలా ఎక్కువగా ఉండేదని బిజెపి నేతలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. కేంద్రం నుంచి అందుతున్న నిధులకు సరైన లెక్కలు చెప్పడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని, నేతలు పాల్పడుతున్న అవినీతితో కేంద్ర నిధులు ప్రజలకు చేరడం లేదు. అందుకే వాటికీ సరైన లెక్కలు చెప్పడంలో బాబు ప్రభుత్వం నీళ్లు నములుతోందని పురందేశ్వరి పరోక్షంగా వ్యాఖ్యానించారు. బాబు సరైన లెక్కలు చూపక పోవడం వలనే కేంద్రం నిధుల్ని ఆలస్యం చేస్తోందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పదే పదే కాంట్రాక్టర్లని మార్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నిధుల వివరాలని కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తే మిగిలానిధులు వాటంతట ఏవ్ వస్తాయని అన్నారు. రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం అదే వైఖరితో ఉందని పురేందేశ్వరి ముఖ్యమంత్రికి చురకలు అంటించారు.

  •  
  •  
  •  
  •  

Comments