చంద్రబాబు-మోడీ ల మధ్య జరిగింది రాజకీయ భేటీ మాత్రమే అంటున్న మాజీ యంపి !

Tuesday, January 16th, 2018, 11:27:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు, దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రధాని మోడీని కలిసింది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని, రాష్టం ఎదుర్కొంటున్న సమస్యలు, నిధుల కొరత ఇతరాత్ర అంశాలన్నీ కేవలం ఒక లేఖ కె పరిమితమయ్యాయని, నిజానికి రానున్న ఎన్నికల్లో బీజేపీ పొత్తుల గురించే ప్రధాన చర్చ జరిగిందని ప్రచారం జరుగుతోంది. దాదాపు 40 నిముషాలపాటు సమావేశం జరిపి, అనంతరం బయటకు వచ్చిన బాబు 2 గంటలపాటు ఒక మీడియా సమావేశం పెట్టి సాధించినది ఏమిటని, రాష్ట్రానికి సంబందించిన కీలక నిర్ణయాలు, సమస్యలు పూర్తిగా గాలికి వదిలేశారని, వారు మాట్లాడుకున్న రాజకీయ ఒప్పందాల విషయమై మన రాష్ట్ర యం పి లకు నష్టం వాటిల్లే అంశం ఒకటి ఉందని మీటింగ్ సారాంశాన్ని రాజమండ్రి మాజీ యం పి, ఉండవల్లి అరుణ్ కుమార్ లీక్ చేసినట్లు గా వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది .

ముఖ్యంగా వారిద్దరి మధ్య కుదిరిన బేరం సీట్ల పంపకం గురించని, కేంద్రం లో ప్రభుత్వం తో, అలాగే ప్రధాని మోడీ తో సత్సంబంధాలు కొనసాగించే దృష్ట్యా, ఆయన ఏమి చెప్పినా సరే అనడం తప్ప వేరే గత్యంతరం లేని బాబు 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపి పోటీచేసేలా, అలానే వున్న 25 యం పి స్థానాలకు మొత్తం కేవలం బీజేపీ మాత్రమే పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందనేది ఆయన అభిప్రాయం. అదే జరిగితే ఎప్పటి నుండో కీలక సభ్యులుగా వుండి పార్టీ కి సేవలందించిన నాయకులను కోల్పోవలసి వస్తుందని, అలాగే యం పి లు ఢిల్లీపై ఆశలు వదులుకోవలసిందే అని సారాంశం. ఈ విధం గా చంద్రబాబు రాష్ట్ర యం పి లకు పెద్ద శఠగోపం పెట్టినట్లే లెక్క అని ఆయన అభిప్రాయం. అప్పుడు వారికి కూడా అసెంబ్లీ సీట్లనే సర్దుబాటు చేయాలని బాబు చూస్తున్నారని ఆయన మాటల వలన తెలుస్తోంది. అసలే ఈ సారి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నుండి టిడిపి లో కి వచ్చిన ఆశావాహలు చాలా మందే వున్నారని, ఇప్పటికే పార్టీ యం యల్ ఏ లు, పార్టీ ఇంచార్జి ల తో బాబు సతమతం అవుతున్నారని, వీటివల్ల పార్టీలో సమస్యలు, చికాకులు అధికమయ్యాయన్నారు. ఇప్పుడు ఈ యం పి లను అసెంబ్లీ కి పోటీచేసే అంశం వల్ల పార్టీకి నష్టం తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది..