వీడియో : ఫ్రెండ్ ని బస్ కింద తోసేసింది.. కొంచంలో తప్పించుకుంది

Saturday, April 21st, 2018, 04:23:45 PM IST

ఈ మధ్య జనాలను నవ్వించడానికి చేసే ప్రాంక్ వీడియోలు ప్రణాల మీదకి వస్తున్నాయి. అది కావాలని చేస్తున్నారో లేక ఎంటర్తైన్మెంట్ కోసం చేస్తున్నారో తెలియకుండా పోతుంది. తాజాగా ఇటివంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అది పోలాండ్‌లోని పాలిష్ టౌన్. ఇద్దరు మహిళలు రోడ్డు పక్కన సరదాగా మాట్లాడుకుంటూ, నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఓ బస్సు వెళ్తున్నది. వెంటనే ఆ మహిళ పక్కనే నడుస్తున్న తన ఫ్రెండ్‌ను అకస్మాత్తుగా బస్సు కిందికి తోసేసింది. అంతే.. ఈ ఘటనను చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలక్కడ ఏం జరుగుతందో అర్థం చేసుకోలేకపోయారు. సేమ్.. బస్సులో ఉన్నవాళ్లు కూడా అలాగే ఫీల్ అయ్యారు. బస్సు డ్రైవర్ కూడా వెంటనే బస్సును ఆపేశాడు. అయితే.. అదృష్టవశాత్తు ఆ మహిళకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. సేఫ్‌గా బయటపడింది. కాని.. దేవుడి దయవల్ల జస్ట్‌లో చావును చూసొచ్చింది. కొంచెం ముందు పడి ఉండే.. ఆమె తల చిద్రమైపోయేది. అయితే. ఇదంతా ఎందుకు చేశావు అని ఆ మహిళను అడిగితే.. ఎహె.. ఇదంతా ప్రాంక్.. ఏదో సరదాకు అలా చేశాను అని అన్నదట ఆ మహిళ. వామ్మో.. ఇటువంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా? ఇక‌.. ఈ ఘ‌ట‌న అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. మరీ ఫ్రెండ్ ని బస్ కింద తోసెంత ప్రంక్ ఏంటి అని ఆ మహిళని పోలీసులు అరెస్టు చేసి శిక్ష విధించారు.

  •  
  •  
  •  
  •  

Comments