టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్టీఆర్‌కు పూల‌మాల‌!

Saturday, September 8th, 2018, 09:07:19 AM IST

తేరాస ఎమ్మెల్యే ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల మాల వేస్తే దానిని ఏమ‌నుకోవాలి? తెలంగాణ‌లో ఆక‌స్మిక ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్నిక‌ల శంఖారావం పూరిస్తున్న వేళ స‌ద‌రు ఎమ్మెల్యే చేష్ట‌లు ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కొచ్చాయి. స‌డెన్‌గా స‌ద‌రు ఎమ్మెల్యే టీడీపీ ఫౌండ‌ర్ అయిన‌ ఎన్టీఆర్‌పై ఇలా ఎందుకు ప్రేమ కురిపించారు? ఏమా క‌థ అంటే వివ‌రంలోకి వెళ్లాల్సిందే.

క్లీన్ అండ్ బ్యూటిఫుల్ ఖమ్మంలో ఎమ్మెల్యేగా ప్ర‌జాసేవ‌లో కొన‌సాగారు పువ్వాడ అజ‌య్‌. క‌మ్యూనిస్ట్ కోట‌లో గులాబీ జెండా రెప‌రెప‌ల‌తో కాంగ్రెస్ త‌ర‌పు నుంచి గెలిచిన అజ‌య్ ఆ త‌ర్వాత తేరాస‌లో చేరారు. యూత్‌లో అత‌డికి ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం. జ‌నాల్లో అంతో ఇంతో మంచి పేరు ఉంది. ఖ‌మ్మంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో అత‌డు చ‌ర్చ‌ల్లో ఉన్నాడు. అందుకే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో తేరాస అధినేత కేసీఆర్‌ మరోసారి ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ చేశారు. ఆ క్ర‌మంలోనే పువ్వాడ అజయ్ ర్యాలీలో అందరికీ షాక్‌నివ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. టిక్కెట్టు క‌న్ఫామ్ అయిన త‌ర్వాత హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న పువ్వాడ‌ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో ఎన్టీఆర్ సర్కిల్ వ‌ద్ద త‌న‌ వాహనాన్ని ఆపి ఎన్టీఆర్ విగ్రహానికి స్వ‌యంగా పూల మాల వేయడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. తర్వాత అజ‌య్ య‌థావిధిగా ర్యాలీని కంటిన్యూ చేశారు. అయితే అభిమానం వేరు. పార్టీ ప్ర‌చారం వేరు. ఎన్టీఆర్‌ అభిమానిగా ఆయ‌న ఫ్యాన్స్‌లో పాజిటివ్ అప్పీల్ సంపాదించాడు. ఆ త‌ర్వాత‌ త‌న ప‌నిలో తాను బ‌య‌ల్దేరాడ‌ని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు.

పువ్వాడ వ‌ర్త‌మానం ప‌రిశీలిస్తే.. మ‌మ‌తా ఎడ్యుకేష‌న్ సొసైటీ వివాదం అప్ప‌ట్లో పెద్ద స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న సొంత ఎడ్యుకేష‌న్ సంస్థ‌లు, ఆస్ప‌త్రుల కోసం భూఆక్ర‌మ‌ణ‌లు చేశార‌ని వివాదంలో చిక్కుకోవ‌డంతో పువ్వాడ త‌న ఆస్తుల్ని ర‌క్షించుకునేందుకు పార్టీలు మారుతుంటార‌న్న ప్ర‌చారం ఉంది. తండ్రి క‌మ్యూనిస్టు అయినా అజ‌య్ మాత్రం వేరే పార్టీల్లో ప‌ద‌వులు అలంక‌రించ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మునుముందు తేరాస ఎమ్మెల్యేగా ఆ పార్టీ త‌ర‌పున‌ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్ర‌మెక్కాల‌ని ఉవ్విళ్లూరుతున్న పువ్వాడ‌కు మంత్రి కేటీఆర్ ఎంతో స‌న్నిహితుడు కావ‌డంతో అత‌డు ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా మారింది. రాబోవు ఎన్నిక‌ల్లో పువ్వాడ ప్ర‌భావం ఎంతో చూడాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments