ఏ అధికారంతో స్పీకర్ ఇలా చేశారు – ప్రశ్నించిన రేవంత్ రెడ్డి

Friday, June 7th, 2019, 12:16:45 AM IST

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది… ఈరోజే కాంగ్రెస్ పార్టీ కి సంబందించిన 12 మంది ఎమ్మెల్యేలు అందరు కూడా తెరాస లో చేరిపోయారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాగా ఇప్పటికి తెలంగాణాలో ఎంఐఎం పార్టీ ప్రతిపక్ష హోదా ని దక్కించుకుంది. దీంతో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాగా ఈ విషయం మీద స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి తెరాస పార్టీ పై పలు విమర్శలు గుప్పించారు. పార్టీలను విలీనం చేసుకునే అధికారం శాసనసభ స్పీకర్లకు లేదని అన్నారు. అంతేకాదు ఇది స్పీకర్ పరిధిలోది రాదని, పార్టీలను విలీనం చేయాలంటే అది కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటుందని అన్నారు.

అంతేకాకుండా తమ పార్టీకి సంబందించిన ఎమ్మెల్యేలను అక్రమంగా బెదిరించి తెరాస పార్టీ లోకి లాక్కున్నారని, అందుకనే ఇలా విలీనానికి అక్రమంగా పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆర్పించారు. ఇక స్పికర్‌కు సభ నిర్వాహణతోపాటు పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపి వారిపై అనర్హత వేటు వేసే అధికారం మాత్రమే స్పికర్‌కు ఉంటుందని అన్నారు. ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్లి ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడనని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా హైకోర్టు అసెంబ్లీ జరీ చేసిన బులిటెన్ చెల్లదని చెప్పిందని, అనర్హత పిటిషన్లను మూడు నెలల్లో విచారించాలని హైకోర్ట్ ఇచ్చిన డైరెక్షను స్పీకర్ ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.