ఆర్.కృష్ణయ్య సంచలనం – అందరిని చదివించడంలో జగన్ తన తండ్రినే మరిపించాడు…

Tuesday, February 12th, 2019, 11:20:00 PM IST

బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, వైసీపీ అధినేత జగన్ ని పొగడ్తలతో ముంచెత్తారు… జగన్ అధ్యక్షతన 17 న ఏలూరులో జరిగే బీసీ సంక్షేమ సంఘం గర్జనకు హజరు కావాలని కృష్ణయ్య ని ఆహ్వానించడానికి వైసీపీ బీసీ విభాగం నేత జంగా కృష్ణమూర్తి నేడు ఆర్.కృష్ణయ్య ని కలవగా…. జగన్ ని ఆకాశానికెత్తేశాడని సమాచారం… ఫీజు రీయింబర్స్ విషయంలో వైఎస్సార్‌తో అనేక సార్లు సమీక్షించి దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాన్ని రూపొందించారు. అనేక హాస్టళ్లు, గురుకులాల ఏర్పాటుకు కృషిచేయటమే కాకుండా, ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్ షిప్‌లు అమలుకు కృష్ణయ్య కృషిచేశారు.

బీసీలకు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మేలు చేశారో అంతకు తగ్గకుండా జగన్ కూడా ఇప్పుడు బీసీ లపై చూపుతున్న ప్రేమ అభిమానం చాలా గొప్పది అని కృష్ణయ్య కొనియాడారు… ఈ విషయం లో జగన్, తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడని కృష్ణయ్య అన్నారు… కానీ ఈ విషయం మీద టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకత చూపిస్తుందని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.