బెజవాడకు అటుఇటు అభివృద్ది

Sunday, September 28th, 2014, 01:30:39 PM IST


విజయవాడ పరిసర ప్రాంతాలలోనే రాజధానిని అభివృద్ది చేస్తామని.. అదే అందరికీ అనువైన ప్రదేశమని ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలు రాజధాని అభివృద్దిలో భాగస్వామ్యం అవుతామని, ఈ నాలుగింటిని వీజీటీఎం పేరుతొ అభివృద్ది చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారానే.. భూమిని సేకరించనున్నట్టు ఆయన తెలిపారు. రాజధానిని కోసం ప్రజలు భూములను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు పల్లె రఘునాథ్ రెడ్డి తెలియజేశారు.