లెజెండ్ మనసులోని మాటలు : పవన్ కళ్యాణ్ ఆ నినాదం ఇస్తే మేం ఈ నినాదం ఇస్తాం అంటున్న రఘువీరా..!

Wednesday, September 28th, 2016, 08:07:12 PM IST

raghuveera-reddy
* ప్రత్యేక హోదా విషయం లో ప్రజల హక్కా లేక ప్రభుత్వ ఇష్టారాజ్యమా అనే విషయం మీద యుద్ధం నడుస్తోందని రఘువీరా రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో ఖచ్చితంగా ప్రజలను గెలిపించి ప్రత్యేక హోదా సాధిస్తామని రఘువీరా అన్నారు.
* ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అది పెద్ద నేరంగా సృష్టించే ప్రయత్నం టిడిపి – బిజెపి లు చేస్తున్నాయని రఘువీరా మండి పడ్డారు.
* ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజ్ కన్నా ప్రత్యేకహోదా వస్తేనే మేలు జరుగుతుందని అన్నారు. దీని కోసం తాను చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చించడానికైనా సిద్ధం అని ప్రకటించారు.
* కాంగ్రెస్ పార్టీ సముద్ర కెరటం లాంటిదని రఘువీరా అన్నారు.ప్రస్తుతం కష్టకాలం లో ఉన్నా త్వరలో పుంజుకుంటుందని అన్నారు.
* వెంకయ్య నాయుడు నరేంద్ర మోడీ కి అమ్ముడు పోయాడని, చంద్రబాబు ప్లవరం కాంట్రాక్టులతో వచ్చే డబ్బు కోసం అమ్ముడు పోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
* చంద్రబాబు తన కున్నా లొసుగుల వలెనే మోడీని ప్రత్యేక హోదా గట్టిగా అడగలేక పోతున్నారని అన్నారు.చంద్రబాబు బలహీనతల చిట్టా మోడీ దగ్గర ఉందని ఎద్దేవా చేశారు.
* ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొత్తనాయకులను కొత్త కార్యకర్తలను తయారు చేసుకోవడం లో బిజీగా ఉందని అన్నారు.
* పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వలన తమకు భయం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదం ఇస్తే.. ఇప్పుడు తాము బిజెపి-టిడిపి హటావో ఆంధ్రప్రదేశ్ బచావో నినాదం ఇస్తున్నామని అన్నారు.
* 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. తాము ఎన్ని కొత్తపార్టీలు వచ్చినా వాటికి భయపడమని జనసేనను ఉద్దేశించి అన్నారు.
* ఏపీ లో కాంగ్రెస్ పార్టీ మాకుమేముగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నామని, తమకు ఎవరితో పొత్తులు పెట్టుకునే ఉద్దేశం లేదని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments