పవన్, జగన్ లను విమర్శిస్తున్న రఘువీరా రెడ్డి

Wednesday, November 21st, 2018, 03:01:24 AM IST


ఎన్నికలలో భాగంగా కొత్త పంథాలో విమర్శలు మొదలవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసిపోయినందువల్లే తెలంగాణ లో జరిగే ఎన్నికల్లో వైకాపా, జనసేన లు పోటీచేయడంలేదని, వీరిరువురు తిట్టుకుంటూనే, లోపల కలిసే పథకాలు వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నాయకులతో, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రఘువీరా రెడ్డి మాట్లాడుతూ జగన్‌, పవన్‌ ఇద్దరూ కూడా ప్రధాని మోదీ గారి ఆజ్ఞ మేరకు డైరక్షన్‌లో కేసీఆర్‌ కి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, బయటికి ఎలాగున్నా కూడా వారి సపోర్ట్ మాత్రం కెసిఆర్ కె ఉందని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణాలో జరిగే ఎన్నికలలో వారిరువురి మద్దతు ఎవరికో చెప్పాలన్నారు. తరువాత జరగబోయే ఏపీ ఎన్నికలలో లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్తానాల్లో పోటీచేసేలా కాంగ్రెస్‌ నాయకుల్ని ఏర్పరచుకున్నామని రఘువీరా రెడ్డి చెప్పారు. ఈసారి ఖచ్చితంగా ఏపీ లో తామే అధికారం లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.