వైరల్ అవుతున్న రాహుల్, మోడీ ఆలింగనం పోస్టర్లు..!

Sunday, July 22nd, 2018, 03:48:32 PM IST

గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం లోక్ సభలో కేంద్ర ఎన్డీయేలోని బీజేపీ పై విభజన హామీలు, మరియు హోదా విషయమై చేసిన మోసానికి వ్యతిరేకంగా వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్మానానికి సభలో సభ్యుల సరైన మద్దతు లేక వీగిపోయిన విషయం తెలిసిందే. కాగా అవవిశ్వాస తీర్మానం సందర్భంగా జరుగుతున్న చర్చలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రధాని మోడీపై అలానే బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా ఆ వీడియో మొన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం వారిద్దరి ఆలింగనం తాలూకు పోస్టర్లను కాంగ్రెస్ కు చెందిన ముంబై కాంగ్రెస్ అధ్యక్షులు మరియి మాజీ ఎంపీ నిరుపమ్ వీటిని ముంబై నగరంలో చాల చోట్ల ఏర్పాటు చేయించారు.

కింద ఉపశీర్షికగా ప్రేమతో గెలుస్తాం, ద్వేషంతో కాదు అని హిందీ భాషలో రాయించారు. ఇక మరోవైపు మొన్న జరిగిన అవిశ్వాస తీర్మాన కార్యక్రమాన్ని శివసేన పార్టీ ఇటీవల జరిగిన ఫుట్ బాల్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తో పోల్చింది. ఫైనల్ లో నరేంద్ర మోడీ ఫ్రాన్స్ వలే అద్భుతంగా ఆడారని, ఇక రాహల్ గాంధీ క్రొయేషియా వలె వారి పార్టీని గ్రూపు దశ నుండి ఫైనల్ వరకు తీసుకురాగలిగి చివరికి ఫైనల్ లో ఎంతో కష్టపడి ఓడిపోయారని ఛలోక్తులు విసిరారు. అయితే మోడివలె రాహుల్ కూడా నిజంగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం మోడీ మరియు రాహుల్ కు సంబందించిన ఆ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు వాటిని ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెడుతున్నారు. కాగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి….

  •  
  •  
  •  
  •  

Comments