మరో క్రికెటర్ ప్రేమలో పడ్డాడా?

Wednesday, May 30th, 2018, 08:50:57 PM IST

సినిమా హీరోయిన్స్ కు క్రికెటర్స్ కు మధ్య స్నేహం ఉండడం ఈ రోజుల్లో కామన్. ఇక ప్రేమల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విరాట్ కోహ్లీ అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కను ఏకంగా పెళ్లి చేసుకొని మరి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ తరువాత చాలా మంది గురించి అనేక రకాల రూమర్స్ వచ్చినప్పటికీ పెద్దగా వైరల్ కాలేదు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ మీడియా ఓ స్టార్ క్రికెటర్ పై మాత్రం అనేక రకాల కథనాలను ప్రచారం చేస్తోంది. అతను ఎవరో కాదు కేఎల్.రాహుల్.

ఎందుకంటే ఈ స్టార్ క్రికెటర్ గత కొన్ని రోజులుగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తో కనిపిస్తున్నాడు. ఆమె పేరు నిధి అగర్వాల్. బాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో కూడా నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచిలో నిధి ఒక సినిమా చేస్తోంది. అయితే నిధి రీసెంట్ గా ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో రాహుల్ తో కనిపించింది. అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రాహుల్ నిధి ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఆ రూమర్స్ పై ఈ జంట పెద్దగా స్పందించడం లేదు.

  •  
  •  
  •  
  •  

Comments