ఇప్పుడు వరల్డ్ కప్ గురించి ఆలోచించండి.. ఐపీఎల్ తరువాత: రాహుల్ ద్రావిడ్

Friday, January 26th, 2018, 05:00:10 PM IST

పృథ్వీ షా నేతృత్వంలోని ఇండియన్ అండర్‌-19 జట్టు వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ వరకు సక్సెస్ ఫుల్ గా దూసుకువచ్చింది. ఈ నెల 30న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో భారత తలపడనుంది. అయితే ఇప్పటివరకు యువ ఆటగాళ్లు మంచి ఆట తీరుతో సెమి ఫైనల్ కు చేరుకున్నారు. కానీ వారిలో కొంత ఆందోళన నెలకొందని తెలుస్తోంది. సెమి ఫైనల్ మ్యాచ్ గురించి కాకుండా ఐపీఎల్ గురించి ఆలోచిస్తున్నారట. ఎందుకంటే శనివారం ఐపీఎల్ వేలంపాట స్టార్ట్ అవ్వనుంది. ప్రస్తుతం అండర్ 19 జట్టులో ఉన్న ఆటగాళ్ల వేలం లిస్ట్ లో ఉన్నాయి.

కెప్టెన్ పృథ్వీ షా తో పాటు మంచి ఆటగాళ్లు గిల్‌, హిమాన్షు రానా, అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌ అలాగే నాగర్‌ కోటి, శివమ్‌ మావి, అర్షదీప్‌ సింగ్‌, హార్విక్‌ దేశాయ్‌ ల పేర్లు ఐపీఎల్ వేలంలో ఉన్నాయి. ఈ ఆటగాళ్లలో కొంతమందిని దక్కించుకోవాలని ప్రాంఛైజీలు ఆలోచిస్తున్నాయట. దీంతో ఎవరు సలెక్ట్ అవుతారు అనే విషయం గురించి ప్లేయర్స్ ఎక్కువగా ఆలోచిస్తున్నారని కోచ్ రాహుల్ ద్రావిడ్ వారికి కౌంటర్ ఇచ్చారు. ఐపీఎల్ ప్రతి ఏడాది వస్తుంది. కానీ వరల్డ్ కప్ ప్రతి సారి రాదు. ముందు ప్రస్తుతం మ్యాచ్ లపై దృష్టి పెట్టండి. ఇందులో రానిస్తేనే భవిష్యత్తు అంటూ స్పీచ్ ఇచ్చారట. ప్రస్తుతం అందుకు సంబందించిన న్యూస్ అన్ని మీడియాల్లో వైరల్ అవుతోంది.