పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళలేదు: రాహుల్

Tuesday, February 6th, 2018, 09:06:05 PM IST

అండర్ – 19 ప్రపంచ కప్ ని సొంత చేసుకున్న భారత యువ జట్టుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆటగాళ్లు అద్భుతంగా రానించి దేశానికి మంచి గుర్తింపు తెచ్చినట్లు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ కోచింగ్ పై అందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఆయన యువ జట్టుకు అందించిన శిక్షణ అసమానం అని మోడీ కూడా ప్రత్యేకంగా అభినందనలను అందించాడు. ఇక పాకిస్తాన్ సెమి ఫైనల్ మ్యాచ్ రోజు రాహుల్ ద్రావిడ్ పై వచ్చిన న్యూస్ హాట్ టాపిక్ అయినా సంగతి తెలిసిందే.

రాహుల్ ద్రావిడ్ పాకిస్తాన్ యువ జట్టు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లాడని కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ విషయంపై రాహుల్ ఫైనల్ గా వివరణ ఇచ్చాడు. న్యూజిలాండ్ పర్యటన అనంతరం భారత్ కు వచ్చిన రాహుల్ మీడియతో మాట్లాడుతూ.. నేను పాకిస్తాన్ బౌలర్ ని మాత్రమే కలిశాను. అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు అతన్ని ప్రశంసించాను. అది కూడా అతను డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్నపుడు కలిశానని రాహుల్ వివరణ ఇచ్చాడు. అంతే కాకుండా పాక్ కోచ్ కూడా భారత జట్టును అభినందించినట్లు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments