రాహుల్ వారసుడు కుమ్మేస్తున్నాడుగా!

Friday, July 27th, 2018, 11:18:12 PM IST

హీరో కొడుకు హీరో అవ్వడం ఈజీ గాని క్రికెటర్ కొడుకు క్రికెటర్ అవ్వడం అనేది చాలా కష్టమైన పనని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి గొప్ప క్రికెటర్ కి అయినా కూడా తన కొడుకు మంచి క్రికెటర్ అయితే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కూడా అలంటి సంతోషంలోనే ఉన్నాడు. ఎందుకంటే రాహుల్ కుమారుడు సమిత్ ద్రావిడ్ తన ఆటతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

అండర్ – 14 టోర్నీలో ద్రావిడ్ వారసుడు ఆల్ రౌండర్ షోతో ప్రశంసలు అందుకుంటున్నాడు. అధితి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ తరపున ఆడుతున్న సమిత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి జట్టు కెంబ్రిడ్జి పబ్లిక్‌ స్కూల్‌ పై అర్ధసెంచరీ చేయడమే కాకుండా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో సమిత్ జట్టు 9 వికెట్లతో విజయాన్ని అందుకుంది. సమిత్ టీనేజ్ వయసులోనే తన బలాన్ని పెంచుకుంటున్నాడు. జనవరిలో కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్స్‌ (కేఎస్‌సీఏ) నిర్వహించిన బీటీఆర్‌ కప్‌లో అందరికంటే ఎక్కువగా ఒక మ్యాచ్ లో 150 పరుగులు చేశాడు. అలాగే అండర్ -12 టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా ద్రావిడ్ వారసుడు నిలిచాడు.

  •  
  •  
  •  
  •  

Comments