మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్

Tuesday, April 24th, 2018, 11:33:10 AM IST

ప్రస్తుతం నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాల వల్ల ఎక్కువగా పెద్ద, మధ్య తరగతి వర్గాల వారు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యుపిఎ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ లో అన్నారు. ఓవైపు బాలికల పై అత్యాచారాలు, మరోవైపు ఎస్సి ఎస్టీ ల హక్కులను కాలరాసే విధంగా చర్యలు జరుగుతుంటే మోడీ మాత్రం మౌన మునిలా మాట్లాడకుండా ఉండడం సరైనది కాదని ఆయన అన్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ప్రవేశ పెట్టి ఆర్ధిక వ్యవస్థని మోడీ ప్రభుత్వం మరింత క్రుంగ తీసిందని అన్నారు. అలానే ఆయన ప్రభుత్వ విధానాల వల్ల భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు ప్రమాదం అంచున వున్నాయి అని ఆయన అభిప్రాయ పడ్డారు. అంతే కాదు ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని కాపాడండి అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు.

అలానే జరుగుతున్న, ఒక్కొక్కటిగా బయటపడుతున్న కుంభకోణాలవల్ల దేశ ప్రతిష్ట మసకబారుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సుప్రీమ్ కోర్టు ని కూడా మోడీ తొక్కిపడుతున్నారని అన్నారు. కాగా నీరవ్ మోడీ వంటి కుంభకోణాల పై తనకు ఒక 15 నిమిషాలు మాట్లాడే అవకాశం కనుక ఇస్తే, తన మాటలకు మోడీ భయపడి పారిపోతారని ఆయన అన్నారు. ఎప్పటికైనా భారత ప్రజల సమస్యలు తీర్చగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ మనసులో మాట బయటపెట్టి కాంగ్రెస్ పత్తికి పట్టం కట్టడం తధ్యమని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు……

  •  
  •  
  •  
  •  

Comments