త్యాగానికి సిద్దమైన కాంగ్రెస్.. బుజ్జగించే పనిలో బీజేపీ!

Thursday, June 7th, 2018, 11:10:24 AM IST

ప్రస్తుతం భారత జనతా పార్టీ ఎన్డీయే కూటమి కి ఎదురుదెబ్బలు చాలా తగులుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో స్థానిక పార్టీలతో కలిసి పార్టీని బలోపేతం చేయాలనీ ఎప్పటి నుంచొ ప్లాన్ వేసుకున్న బిజెపికి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల చిక్కులు వచ్చి పడ్డాయి. సాధారణంగా ఏ పార్టీ అయినా సరే కలిసి పోటీ చేస్తే కలకాలం అలానే ఉంటుందని గ్యారెంటీ లేదు. పార్టీ మనుగడ కోసం కూటములు తప్పవు. అధికారం దక్కపోయినా స్థానిక పార్టీలను కలుపుకుంటూ పోతు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవాలి.

ప్రతిసారి కాంగ్రెస్ – భాజపా చేస్తున్నది అదే. దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్నవి ఇవి రెండే. థర్డ్ ఫ్రంట్ అనేది ఇప్పట్లో జరిగే అంశాల కనిపించడం లేదు. మొన్నటి వరకు కేసీఆర్ ప్రయత్నం చేసినప్పటికీ ఎలక్షన్స్ సమయంలో ఆ మూడ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇక ఈ సారి కాంగ్రెస్ బిజెపి వ్యతిరేక పార్టీలను తనలో కలుపుకోవాలని చూస్తోంది. అవసరం అయితే రాష్ట్రంలో సీఎం పదవిని త్యాగం చేసి మరి మద్దతు కోరుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కర్ణాటక లో ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ సీఎం పదవి జేడీఎస్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్రంలో ఎలాగైనా కూటములు ఏకం చేయాలనీ అధ్యక్షుడు రాహుల్ ప్లాన్ వేస్తున్నాడు. మరోవైపు భారత జనతా పార్టీ వ్యతిరేకులను బుజ్జగించే పనిలో పడింది. అమిత్ షా వ్యూహ రచనలు మొదలు పెట్టారు. వ్యతిరేకిస్తున్న పార్టీలతో ఇప్పటికే మీటింగ్ జరపాలని షెడ్యూల్ సెట్ చేసుకున్నారు. రీసెంట్ గా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తో కూడా మంతనాలు జరిపారు. విమర్శలు ఎక్కువైతే నెక్స్ట్ ఎలక్షన్ లో ఎఫెక్ట్ తప్పదనిక్ బీజేపీకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఇక దాన్ని వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments