అత్యవసర సమయంలో పవర్ స్టార్ ఫార్ములా..!!

Monday, December 4th, 2017, 02:35:00 PM IST

రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అంతా సిద్ధం అయిపోయింది. రాహుల్ గాంధీ రారాజు కావడం ఇక లాంఛనమే. రాహుల్ గాంధీ గత రెండు మూడు నెలల కాలం నుంచి రాజకీయ పరిణితి కనబరుస్తున్నారు. రాహుల్ లో పొలిటికల్ పరిజ్ఞానం పెరిగిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. దీనికి రాజకీయ వర్గాలు రకరకాల కారణాలని విశ్లేషిస్తున్నాయి. గతంలో బిజెపికి కౌంటర్ ఇవ్వడంలో రాహుల్ గాంధీ తేలిపోయే వాడు. ఆయనలో పొలిటికల్ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువని బిజెపి నేతలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఆ ముద్రని చెరిపివేసుకుని తాను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి అర్హుడినే అని రాహుల్ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది. అందుకే ఈ కాంగ్రెస్ యువరాజు కొత్త పంథాని అవలంభిస్తున్నారు. ఏదైనా కొత్త ప్రయత్నించినప్పుడే ఫలితాలు కూడా బావుంటాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. తన విమర్శల బులెట్ లని నేరుగా కాకుండా ట్విట్టర్ ద్వారా గురిపెట్టి కొడుతున్నాడు. తాను ఆడాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా నరేంద్ర మోడీనే అడిగేస్తున్నారు.

ఈ ఫార్ములా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పాటిస్తారో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ప్రశ్నించడానికంటూ పార్టీ పెట్టిన పవన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నాడు. దీనిని విమర్శలు ఎదురవుతున్నా తన దారిలో తాను వెళుతున్నాడు. రాహుల్ కూడా పవర్ స్టార్ రూట్ లోకి రావడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి ఒకటి, రెండు..మూడు అంటూ ఇప్పటివరకు ఆరు పదునైన ప్రశ్నలు సంధించారు.

  •  
  •  
  •  
  •  

Comments